»   » శ్రీరెడ్డిపై వెనక్కి తగ్గిన ‘మా’... నిషేదం ఎత్తివేత: కోన వెంకట్, అభిరామ్‌పై దాటవేత!

శ్రీరెడ్డిపై వెనక్కి తగ్గిన ‘మా’... నిషేదం ఎత్తివేత: కోన వెంకట్, అభిరామ్‌పై దాటవేత!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్లో సంచలనంగా మారిన శ్రీరెడ్డి వ్యవహారంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) వెనక్కి తగ్గింది. ఆమెపై విధించిన నిషేదాన్ని ఎత్తివేసింది. ఆమెతో 'మా'లోని 900 మంది సభ్యులు నటిస్తారని, ఆమె 'మా’ మెంబర్‌షిప్ విషయంలో త్వరలోనే కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని గురువారం సాయంత్రం మీడియా సమావేశంలో 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా ప్రకటన చేశారు.

Sri Reddy Reveals Writer Kona Venkat's Name
 ఆ రోజు మనస్తాపంతో ఆ నిర్ణయం

ఆ రోజు మనస్తాపంతో ఆ నిర్ణయం

ఆ రోజు శ్రీరెడ్డి చేసిన పనికి మనస్తాపం చెంది ఆ నిర్ణయం తీసుకున్నామని, ఇపుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు శివాజీ రాజా వెల్లడించారు. శ్రీరెడ్డి కూడా ‘మా' కుటుంబంలో సభ్యురాలే అని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

 ఇండస్ట్రీ పెద్దలు కూడా కోరారు

ఇండస్ట్రీ పెద్దలు కూడా కోరారు

శ్రీరెడ్డి మీద నిషేదం ఎత్తివేయాలని, ఆమెను ‘మా'లో కలుపుకుపోవాలని ఇండస్ట్రీలోని పెద్దలు కోరారని, అందుకే తమ నిర్ణయాన్ని పున:సమీక్షించామని, అన్నీ ఆలోచించిన తర్వాత ఆమెపై నిషేదం ఎత్తివేయాలని నిర్ణయించామని తెలిపారు.

‘మా' అవకాశాలు ఇప్పించలేదు

‘మా' అవకాశాలు ఇప్పించలేదు

మా లాగే మన పరిశ్రలో నిలదొక్కుకోవాలని రెండు రాష్ట్రాల నలుమూలల నుండి ఎంతో మంది వస్తుంటారు. కొంత మందికి అవకాశాలు దొరుకుతాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది అవకాశాలు ఇప్పించలేదు, అవకాశాలు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఇస్తారని... అది తమ చేతుల్లో ఉండదని శివాజీ రాజా తెలిపారు.

 శ్రీరెడ్డి సినిమాలపై ఫోకస్ పెట్టాలి

శ్రీరెడ్డి సినిమాలపై ఫోకస్ పెట్టాలి

ఇకపై నుండి 900 మంది శ్రీరెడ్డితో నటించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ అమ్మాయి శ్రీరెడ్డి కూడా సినిమాలపై దృష్టి పెట్టి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా శివాజీ రాజా ఆకాంక్షించారు.

కోన వెంకట్, అభిరామ్ గురించి..

కోన వెంకట్, అభిరామ్ గురించి..

శ్రీరెడ్డి లీక్ చేసిన దగ్గుబాటి అభిరామ్, కోన వెంకట్ అంశాలపై కొందరు మీడియా వారు ప్రశ్నించగా.... వారికి, ‘మా'కు ఎలాంటి సంబంధం లేదని, వారు ‘మా'లో సభ్యులుకారంటూ ఈ విషయాన్ని దాట వేశారు.

ఎవరెవరు పాల్గొన్నారు?

ఎవరెవరు పాల్గొన్నారు?

ఈ సమావేశంలో శివాజీ రాజా, నరేష్, జెమినీ కిరణ్, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ‘మా' సభ్యులు సమాధానాలు చెప్పారు. తమకు సంబంధంలేని ప్రశ్నలను దాటవేసే ప్రయత్నం చేశారు.

English summary
Movie Artist Association lifted ban on Sri Reddy. Recently Actress Sri Reddy has made a terrific protest by stripping herself in front of Movie Artist Association(MAA) for seeking a membership card in Film Industry (MAA).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X