»   »  ‘మా’ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన మురళీ మోహన్ (లిస్ట్)

‘మా’ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన మురళీ మోహన్ (లిస్ట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘మా' ఎన్నికల ఫలితాలను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మురళీ మోహన్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ‘మా' అధ్యక్షుడిగా గెలుపొందిన రాజేంద్రప్రసాద్‌కు అభినందనలు తెలిపారు. ఆర్టిస్టులంతా ఒకే కుటుంబం అని, గతంలో తాము విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నప్పటికీ కేవలం అవి ఎన్నికల వరకు మాత్రమే పరిమితమని తెలిపారు. గతంలోనూ తాను ఇదే విషయాన్ని చెప్పినట్లు తెలిపారు. రాజేంద్రప్రసాద్ కు తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ‘మా' ఎన్నికల్లో గెలుపొందిన వారి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. మొత్తం 702 ఓట్లకుగాను, 394 ఓట్లు పోలయ్యాయి.

rajendra prasad

అధ్యక్షుడు: గద్దె రాజేంద్రప్రసాద్... 85 ఓట్లతో ఆధిక్యం విజయం
ఉపాధ్యక్షులు: మంచు లక్ష్మి (ఏకగ్రీవం)
కార్య నిర్వాహక కార్యదర్శి : తనికెళ్ల భరిణి...165 ఓట్లతో విజయం(జయసుధ ప్యానెల్)
ప్రధాన కార్యదర్శి: శివాజీ రాజా... 36 ఓట్ల ఆధిక్యంతో విజయం (రాజేంద్రప్రసాద్ ప్యానెల్)
కోశాధికారి : పరుచూరి వెంకటేశ్వరరావు... 159 ఓట్లతో విజయం (జయసుధ ప్యానెల్)
జాయింట్ సెక్రటరీలు: నరేష్, రఘుబాబు (జయసుధ ప్యానెల్)
ఎగ్జిక్యూటివ్ కమిటీ: బెనర్జీ, బ్రహ్మాజీ, చార్మి, రాజేశ్వర్, ఏడిద శ్రీరామ్, గీతాంజలి, హరినాథ్ బాబు, హేమ, జాకీ, జయలక్ష్మి, కాదంబరి కిరణ్, నర్సింగ్ యాదవ్, రాజీవ్ కనకాల, శ్రీ శశాంక, విద్యాసాగర్ తదితరులు

English summary
Movie Artist Association result announced. Che out winners list.
Please Wait while comments are loading...