Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఈ వీకెండ్ రిలీజవుతున్న సినిమాలు ఇవే...
హైదరాబాద్ : వీకెండ్ రాగానే ఏదో ఒక సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుంది. అయితే ఈ శుక్రవారం(జూన్ 7) నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ మధ్యలో పెద్ద సినిమా విడుదల ఏమీ లేక పోవడంతో చిన్న సినిమాలన్నీ విడుదలకు క్యూ కట్టాయి. ఈ వారంతోపాటు, వచ్చే వారం కూడా మరిన్ని చిన్న సినిమాలు విడుదల కానున్నాయి.
రాష్ట్రంలోని ప్రముఖ టెర్రిటరీల్లో థియేటర్లన్నీ భారీ నిర్మాతల గుప్పిల్లో చిక్కుకున్నాయి. పెద్ద సినిమాలు విడుదలకు రెడీగా ఉన్న సమయంలో చిన్న సినిమాలకు కనీసం పట్టుమని పది థియేటర్లు కూడా దొరికే పరిస్థితి ఉండదు. థియేటర్ల గుత్తాధిపత్యం వల్ల ఎన్నో సినిమాలు విడుదలకు నోచుకోవడమూ లేని సంగతి తెలిసిందే.
అసలు థియేటర్లకు దొరకడమే కష్టంగా మారిన నేపథ్యంలో పలు చిన్న సినిమాలు ఇదే మంచి అవకాశంగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ వారం శ్రీయ ప్రధాన పాత్రలో నటించిన 'పవిత్ర' సినిమాతో పాటు, సుధీర్ బాబు నటించిన 'ప్రేమ కథా చిత్రం', 'థియేటర్లో నలుగురు' అనే చిత్రంతో పాటు.....హాలీవుడ్ అనువాద చిత్రం '1000 సంవత్సరాల తర్వాత మరో భూప్రపంచం'(After Earth) చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.

శ్రీయ టైటిల్ రోల్‌లో జనార్ధన మహర్షి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పవిత్ర'. ఉప శీర్షిక ‘ఎ బోల్డ్ అండ్ గోల్డ్ ఫిల్మ్'. కె. సాదక్ కుమార్, జి. సాయి మహేశ్వర రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదకు సిద్ధం అవుతోంది. జూన్ 7న తేదీన ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

‘ఎస్ఎంఎస్' చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన సుధీర్ బాబు తాజాగా ‘ప్రేమకథా చిత్రమ్' ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. కెమెరామెన్ జె.ప్రభాకర్‌రెడ్డి తొలిసారిగా దర్శకత్వం వహిస్తూ ఆర్.పి.ఎ. క్రియేషన్స్, మారుతీ టాకీస్ పతాకంపై సుదర్శన్‌రెడ్డి, మారుతి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నందిత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఈనెల 7న విడుదలకు సిద్ధమైంది.

శ్రీకాంత్ రాఘవ, ధీరజ్, వరుణ్ అభిషయ్, శంకర్ యస్. హీరోలుగా నటిస్తున్న చిత్రం 'థియేటర్లో... నలుగురు'. మాంత్రిక్స్ మీడియా వర్క్స్ పతాకంపై సాయికిరణ్ ముక్కామల నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాసరాజు దర్శకుడు. శ్వేతాపండిట్ నాయిక. కామెడిని మేళవించి కమర్షియల్ థ్రిల్లర్ గా దీన్ని రూపొందించారు. మౌళిక, బెనర్జీ, జూ. రేలంగి, రామ్‌సుభాష్, వీరభద్రం, శ్రుతి, నాగేశ్వరరావు, తేజ, రాజా, సుధీర్ తారాగణమైన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: యస్.డి. జాన్, కూర్పు: యస్.ఆర్. శేఖర్, కళ: నాగేంద్ర, స్టంట్స్: నందు, సహ నిర్మాత: దీప్తి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీనివాసరాజు.

ప్రముఖ హాలీవుడ్ చిత్రనిర్మాణ సంస్థ కొలంబియా పిక్చర్స్ నిర్మించిన After Earth అనే చిత్రం తెలుగులో ‘1000 సంవత్సరాల తర్వాత మరో భూప్రపంచం' పేరుతో విడుదల చేస్తున్నారు. కరాటే కిడ్ చిత్రంలో మెరుపు వేగంతో ఫైట్ చేసిన 12 ఏళ్ల వండర్ కిడ్ Jaden SMith ఈచిత్రంలో చేసే విన్యాసాలు ఆకట్టుకుంటాయి.