twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జీవితా రాజశేఖర్ ఎనిమిది నెలల గర్భిణి.. ఆమె సహకారం మర్చిపోలేనిది

    By Rajababu
    |

    కాకతీయ కళావైభవానికి రాజకీయంతో సంబంధం లేదని, కళలను ప్రోత్సహించేందుకే దానిని ఏర్పాటు చేసినట్లు కాకతీయ లలిత కళా పరిషత్‌ ఛైర్మన్‌ టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందానికి 'హాస్యనట బ్రహ్మ' పురస్కారంతో ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి, మంత్రి జూపల్లి, ప్రణాళిక విభాగం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, నంది ఎల్లయ్య, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్‌, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డితోపాటు వంశీచంద్‌రెడ్డి హాజరయ్యారు.

    Recommended Video

    'హాస్యనట బ్రహ్మ' పురస్కార కార్యక్రమంలో నో పాలిటిక్స్‌ ?
    ప్రజలకు కన్నుల పండువ

    ప్రజలకు కన్నుల పండువ

    ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ..‘‘పాలమూరు ప్రజలకు కన్నుల పండగ చేసేందుకు వచ్చిన సినీ ప్రముఖులకు ధన్యవాదాలు. ఇది మామూలు కార్యక్రమం కాదు. కాకతీయ కళా వైభవ మహోత్సవాన్ని హైదరాబాద్‌ శిల్ప కళావేదికలో నిర్వహించిన తర్వాత వరంగల్‌లో చేస్తానని సుబ్బరామిరెడ్డిగారు నాతో అన్నారు. కానీ, పాలమూరు ప్రజల కోసం ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరా. బ్రహ్మానందం గారితో 1992లో ‘ప్రేమ ఎంతమధురం'అనే సినిమాను నేను తీస్తే దానిలో ఆయన నటించారు.

    జీవిత ఎనిమిది నెలల గర్భిణి

    జీవిత ఎనిమిది నెలల గర్భిణి

    విదేశాల్లో 25ఏళ్లు ఉన్న తర్వాత 1996లో నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. అప్పుడు జీవిత రాజశేఖర్‌ ఎనిమిది నెలల గర్భిణి ఉండి కూడా నా తరపున ప్రచారం చేశారు. వారి అందించిన సహకారం మర్చిపోలేనిది. ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవని అన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ కళాలకు ప్రాంతాలతో సమానంలేదని, కళాకారులను తెరాసా ప్రభుత్వం సముచితమైన గౌరవం ఇస్తుందన్నారు.

     సుబ్బరామిరెడ్డిగారికి ధన్యవాదాలు

    సుబ్బరామిరెడ్డిగారికి ధన్యవాదాలు

    కేంద్ర మాజీమంత్రి సూదిని జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ గొప్పనటుడు బ్రహ్మనందాన్ని పాలమూరు వేదికగా సన్మానించటం అభినందనీయమన్నారు. ఇక్కడ ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సుబ్బరామిరెడ్డిగారికి ధన్యవాదాలు'' అని అన్నారు.

    పాలమూరులో సినీ ప్రముఖులు

    పాలమూరులో సినీ ప్రముఖులు

    సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.. సినీ ప్రముఖుల హాజరు పాలమూరువాసులను ఆనందాన్ని పంచింది.. సినీ, రాజకీయ ప్రముఖుల సందడితో పట్టణం పులకించింది.. టీఎస్‌ఆర్‌ కాకతీయ లలిత కళా పరిషత్తు ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల మైధానంలో కాకతీయ కళా వైభవ మహోత్సవం కన్నులపండువగా కొనసాగింది. ఎంపీ సుబ్బరామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సినీనటుడు బ్రహ్మానందంను హాస్య నటబ్రహ్మ పురస్కారంతో సత్కరించారు.

    హాజరైన రాజకీయ, సినీ తారలు

    హాజరైన రాజకీయ, సినీ తారలు

    ఈ వేడుకలో సినీ నటుడు, అందోల్‌ ఎమ్మెల్యే బాబుమోహన్‌, పురపాలిక ఛైర్‌పర్సన్‌ రాధ, నటులు జయప్రద, జీవిత, రాజశేఖర్‌, శ్రద్ధాదాస్‌, అలీ, శ్రీనివాస్‌రెడ్డి, రఘుబాబు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎల్లూరి శివారెడ్డి, గోరటి వెంకన్న, జంగిరెడ్డి, నీరజాదేవి, పద్మాలయ ఆచార్య తదితరులను శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.

    సినిమాలతోనే ఆహ్లాదం

    సినిమాలతోనే ఆహ్లాదం

    జడ్పీ ఛైర్మన్‌ భాస్కర్‌ మాట్లాడుతూ సినీమాలపై ఉన్న తన మక్కువను వేదికపై పంచుకున్నారు. హమాలీ పని చేసే తనకు సినిమాలతోనే ఆహ్లాదం ఉండేదని చెప్పారు. బాద్మి శివకుమార్‌, లయన్‌ విజయ్‌కుమార్‌, వంశీరామరాజు, ధర్మారావు, మనోహర్‌రెడ్డి, లయన్‌ నటరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Dr T Subbarami Reddy, Member of Parliament, in his address on the occasion of felicitating Tollywood comedian Dr K Brahmanandam in ‘Kakatiya Kala Vaibhava Mahotsavam’ held in Mahabubnagar town on Sunday, said such programmes to celebrate the art and culture of Kakatiyas would be held not only in every district across Telangana, but also in major cities of Andhra Pradesh, Maharashtra, Karnataka and Tamil Nadu, as the Kakatiya dynasty was spread across all these States around 700 years ago.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X