Don't Miss!
- News
బాలకృష్ణకు `కాపు`నాడు వార్నింగ్: పెదవి విప్పని పవన్- `పొత్తు` పోతుందనే భయం..?!
- Sports
ICC ODI Rankings: కివీస్ క్లీన్ స్వీప్.. టీమిండియాదే అగ్రస్థానం! ఆసీస్ పనిబడితే..!
- Finance
Tata motors: ధరలు పెంచిన టాటా మోటార్స్.. ఆ వాహనాలపై తగ్గిన డిస్కౌంట్లు
- Lifestyle
వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..
- Technology
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- Automobiles
గ్రాండ్ విటారా కోసం రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి.. కారణం ఏమిటంటే?
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
విజయ్ దేవరకొండ మరో సంచలనం.. చాలా కష్టం, అయినా సాధించావ్.. ఎంపీ కవిత కామెంట్!
Recommended Video

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్నాడు. యువతలో విజయ్ దేవరకొండ క్రేజ్ భారీగా పెరుగుతోంది. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలు అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. విజయ్ దేవరకొండ నటన, అతడి మేనరిజమ్స్ యువతకు బాగా నచ్చుతున్నాయి. కేవలం సినిమా విజయాలే కాకుండా విజయ్ దేవరకొండ అనేక ఘనతలు సొంతం చేసుకుంటున్నాడు.

ఫోర్బ్స్ జాబితాలో
విజయ్ దేవరకొండ గత ఏడాది ఫోర్బ్స్ టాప్ 100 ఇండియన్ సెలెబ్రిటీల జాబితాలో ఒకడిగా నిలిచాడు. కొన్ని రోజుల క్రితం ఫోర్బ్స్ విడుదల చేసిన 30 అండర్ 30 జాబితాలో స్థానం దక్కించుకున్నాడు. విజయ్ దేవరకొండకు బయట ఎంతలా క్రేజ్ ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఆన్ స్క్రీన్ పై తనదైన శైలిలో విభిన్నంగా సాగే పెర్ఫామెన్స్ తో ఆకట్టుకునే విజయ్ దేవరకొండ, సినిమా వేదికలపై రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటూ ఎనర్జిటిక్ స్పీచ్ లతో ఆకట్టుకుంటున్నాడు.
విజయ్ దేవరకొండపై షాకింగ్ రూమర్... దిల్ రాజుతో ఆ ఇష్యూ నిజమేనా?
|
ఆంధ్రబ్యాంక్ కథ
ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకున్న సందర్భంగా విజయ్ దేవరకొండ అభిమానులకు ఆసక్తికర విషయాన్ని తెలియజేశాడు. తనకు 25 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆంధ్రాబ్యాంక్ లో 500 మినిమమ్ బ్యాలెన్స్ లేదని తన అకౌంట్ ని బ్లాక్ చేసినట్లు విజయ్ తెలిపాడు. ఆ సమయంలో నాన్న మాట్లాడుతూ.. 30 ఏళ్ల లోపే లైఫ్ లో సెటిల్ అయ్యేందుకు ప్రయత్నించు. ఆ సమయంలోనే నీ సక్సెస్ ని నిజంగా ఎంజాయ్ చేయగలవు. తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండగానే సక్సెస్ సాధిస్తేనే నిజమైన విజయం అని నాన్న అన్నారు.

చాలా కష్టం, అయినా సాధించావ్
సరిగ్గా నాలుగేళ్ళ తర్వాత ఫోర్బ్స్ 100 జాబితాలో, 30 అండర్ 30లో స్థానం దక్కించుకున్నానని విజయ్ దేవరకొండ తన విజయాన్ని తెలియజేశాడు. దీనిపై తెలంగాణ ఎంపీ కవిత స్పందించారు. ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న విజయ్ దేవరకొండకు శుభాకాంక్షలు. చాలా మంచి విజయాలు సాదిస్తునావు. మీ తండ్రి అంచనాలని అందుకుంటున్నందుకు కూడా అభినందనలు. ఇది అంత సులువు కాదు.. అయినా సాధించావు అంటూ కవిత ట్విట్టర్ ద్వారా విజయ్ కు అభినందనలు తెలిపారు.

డియర్ కామ్రేడ్
సినిమాల విషయానికి వస్తే విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు. భరత్ కమ్మ ఈచిత్రానికి దర్శకుడు. కార్మికుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆసక్తిని రేపుతోంది. స్టూడెంట్ గా ఉన్న విజయ్ దేవరకొండ కార్మికుల కోసం ఎలా పోరాడాడు అనే కథాంశంతో తెరకెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రష్మిక మందన మరోమారు విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.