For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫంక్షన్ లో.. నాగచైతన్య, తమన్నాలే ఎట్రాక్షన్ (ఫోటోలతో..)

  By Srikanya
  |

  హైదరాబాద్: మెగా సూపర్‌ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న చిత్రం 'మిస్టర్ పెళ్లికొడుకు'. సునీల్, ఇషాచావ్లా జంటగా నటించారు. సి.దేవీప్రసాద్ దర్శకత్వం వహించారు. ఎన్వీ ప్రసాద్, పారస్‌జైన్ నిర్మాతలు. ఆర్.బి.చౌదరి సమర్పిస్తున్నారు. ఎస్.ఎ.రాజ్‌కుమార్ స్వరాలందించారు. ఈ చిత్రం ఆడియో పంక్షన్ ఘనంగా హైదరాబాద్ లో జరిగింది.

  ఈ చిత్రం పాటల సీడీ లోగోను హైదరాబాద్‌లో నాగచైతన్య ఆవిష్కరించారు. సీడీలను వి.వి.వినాయక్ విడుదల చేసి తమన్నా, నాగచైతన్యకు అందజేశారు. 'తను వెడ్స్‌ మను' రీమేక్ గా వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని నమ్మకం అతిధులు వ్యక్తం చేసారు.

  ఈ ఆడియో పంక్షన్ లో నాగచైతన్య, తమన్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దర్శకులు సంపత్ నంది, వినాయిక్ లతో వీరు ఉత్సాహంగా పాల్గొన్నారు. పంక్షన్ యావత్తూ చాలా సరదాగా ఓ పెళ్ళి వేడుకలా జరిగింది. దర్శకుడు దేవిప్రసాద్ ఈ చిత్రంపై తనకున్న కాన్ఫిడెన్స్ కనపడింది.

  దేవిప్రసాద్ దర్శకత్వంలో సునీల్, ఇషా చావ్లా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ పెళ్లికొడుకు'.ఈ చిత్రం ఆడియో సీడీ లోగోను నాగచైతన్య ఆవిష్కరించారు.

  సీడీలను వి.వి.వినాయక్ విడుదల చేసి తమన్నా, నాగచైతన్యకు అందజేశారు.

  సునీల్ మాట్లాడుతూ...‘‘ఆర్బీ చౌదరిగారు వాళ్లబ్బాయిని పెట్టి తీసే సినిమాక్కూడా ఇంత ఖర్చుపెట్టరేమో! నా మీద మాత్రం చాలా ఖర్చు పెట్టేశారు. ఆయన నమ్మకం వృధా పోదు. ఇది మన సంప్రదాయానికి దూరంగా ఉండే కథ. అలాంటి కథను మన సంప్రదాయంలోకి ఒదిగిపోయేట్లు చేసి, అందంగా తెరకెక్కించిన దేవిప్రసాద్‌ని అభినందించకుండా ఉండలేం. ఎస్.ఎ.రాజ్‌కుమార్‌ గారికి చెప్పి మరీ రిథమ్ ఉండేలా పాటల్ని చేయించుకున్నాను. అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారాయన'' అన్నారు.

  కామెడీ, సెంటిమెంట్ మేళవించిన చక్కని కథతో రూపొందుతోన్న చిత్రమిదని, ఫిబ్రవరి మూడో వారంలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు.

  సునీల్ మాట్లాడుతూ "నల్లమలుపు బుజ్జి మాట విని 'తను వెడ్స్ మను' చూశాను. తెలుగుకు తగ్గట్టు మార్పులు చేశారు. మనది కాని సబ్జెక్ట్‌ను మన వాతావరణానికి అనుగుణంగా మార్చి చూపారు దేవీ ప్రసాద్. పాటలన్నీ రిథమ్‌తో జోష్‌గా ఉంటాయి. మా సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సినిమాకి వచ్చేవారికి రెట్టింపు ఆనందాన్ని కలిగిస్తాం'' అని అన్నారు.

  రచ్చ తర్వాత మా బ్యానర్‌లో 'మిస్టర్ పెళ్ళికొడుకు' హిట్ సినిమాగా నిలుస్తుంది. ట్రెండీ మ్యూజిక్ వినిపిస్తుంది'' అని చెప్పారు.

  కష్టం అనే పదానికి రూపం ఇవ్వాల్సి వస్తే సునీల్ ఫోటో పెడితే సరిపోతుందని వి.వి.వినాయక్ అభినందించారు.

  దర్శకుడు దేవి ప్రసాద్ మాట్లాడుతూ "సునీల్ డ్యాన్సులు, ఎస్.ఎ.రాజ్‌కుమార్ పాటలు హైలైట్ అవుతాయి. 'తను వెడ్స్ మను' చిత్రాన్ని తెలుగుకు తగ్గట్టు పూర్తిగా మార్పులు చేర్పులు చేశాం. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించారు'' అని అన్నారు.

  సునీల్‌తో కలిసి 'జోష్'లో చేశానని, ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నామని, సునీల్‌ ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు నాకు చూపించాడు. అవి చూసి ఆశ్చర్యపోయా. అతని కష్టానికి తగిన ఫలితం రావాలి నాగచైతన్య చెప్పారు.

  తమన్నా మాట్లాడుతూ... ''సునీల్‌ ఇచ్చిన స్ఫూర్తితో నేను కూడా కష్టపడతా..'' అంది తమన్నా అన్నారు.

  వినాయక్‌ మాట్లాడుతూ ''కష్టానికి ఓ రూపం ఇవ్వాల్సివస్తే.. సునీల్‌ బొమ్మ పెడితే సరిపోతుంది. ఈస్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు'' అన్నారు.

  ఈ కార్యక్రమంలో భీమనేని శ్రీనివాసరావు, వాకాడ అప్పారావు, సంపత్‌నంది, రామజోగయ్య శాస్త్రి, తులసి, ముప్పలనేని శివ, సమీర్‌ రెడ్డి, చిత్ర సమర్పకుడు ఆర్‌.బి. చౌదరి, బి.సురేష్ చౌదరి, సమీర్ రెడ్డి, ఖలీల్, ఆదిత్య సత్యదేవ్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

  English summary
  The audio release function of 'Mr.Pellikoduku', starring Sunil and Isha Chawla in the lead roles has been conducted here in Hyderabad. V.V.Vinayak, Naga Chaitanya and Tamanna attended as the chief guests for the function. The director Devi Prasad says, "I am a big fan of Sunil's dances. Many assumed that Sunil cannot be taken in the film, which is a remake of super hit film 'Tanu weds Manu'. But their doubts will be cleared, once they watched the movie. Sunil and Isha Chawla have done wonderfully".
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X