»   » అల్లు అర్జున్ రియల్ లైఫ్ లోనూ ‘మిస్టర్ ఫర్ఫెక్టే’!

అల్లు అర్జున్ రియల్ లైఫ్ లోనూ ‘మిస్టర్ ఫర్ఫెక్టే’!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'గంగోత్రి" సినిమా చూసినప్పుడు అల్లు అర్జున్ ఓ స్టయిలిస్ స్టార్ అవుతాడని ఎవరూ ఊహించి ఉండరు. బన్నీ, ఆర్య, దేశముదురు, పరుగు, ఇలా పలు హిట్ చిత్రాలతో ఆయన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకు అతను తీసుకున్న శ్రద్ద, పడిన శ్రమ తక్కువేం కాదు. దక్షిణాది హీరోలకు సరైన పర్సనాలిటీ ఉండదని ఓ హీరోయిన్‌ అన్నందుకు పట్టుదలతో 'సిక్స్‌ప్యాక్‌' డెవలప్‌ చేసి చూపించారు. వృత్తిపరంగా ఆయనకున్న కమిట్‌మెంట్‌కు ఇదో నిదర్శనం. తాజాగా ఆయన మరోసారి 'మిస్టర్‌ ప్రొఫేషనల్‌' అనిపించుకున్నారు.

అల్లు అర్జున్‌ ప్రస్తుతం గుణశేఖర్‌ దర్శకత్వంలో డివివి.దానయ్య నిర్మిస్తున్న 'వరుడు' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఒక పాట చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్‌ ఉంది. అయితే ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన పోరాట సన్నివేశాల సమయంలో బన్నీ చేతికి గాయమైంది. వారంరోజులు విశ్రాంతి తీసుకొమ్మని వైద్యులు సూచించారు. సినిమా విడుదల తేదీని ఈ నెల 26 అని ప్రకటించడంతో బన్నీకి అయిన గాయం వల్ల విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఏర్పడింది.

దీన్ని గమనించిన బన్నీ మరుసటి రోజే షూటింగ్‌లో పాల్గొని యూనిట్‌ సభ్యుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అల్లు అర్జున్‌ అనేసరికి పార్టీ పక్షి అనీ, ఎప్పుడూ మిత్రులూ, అమ్మాయిలతో వెలిగిపోతుంటాడనీ సినిమా ఇండిస్ట్రీలో టాక్‌! కానీ సినిమా విషయానికొచ్చేసరికి పక్కా ప్రొఫేషనల్‌గా ఉంటాడని 'వరుడు' చిత్ర యూనిట్‌ సభ్యులు కితాబిచ్చేశారు. ఇదే నెల 26న 'వరుడు' తెరమీదకు రాబోతున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu