»   » వంద రోజుల వైపు పరుగులు తీస్తున్న ప్రభాస్ మిస్టర్‌ పర్‌ఫెక్ట్

వంద రోజుల వైపు పరుగులు తీస్తున్న ప్రభాస్ మిస్టర్‌ పర్‌ఫెక్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

''వినోదం, సంగీతం, కుటుంబ బంధాలు... వీటితో అల్లుకొన్న కథ 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌'. ఈ సినిమా కోసం రెండేళ్లపాటు కష్టపడ్డాం. దానికి తగిన ప్రతిఫలం వచ్చిందంటున్నారు" దిల్‌ రాజు. ఆయన నిర్మించిన చిత్రం 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌'. ప్రభాస్‌ కథానాయకుడు. కాజల్‌, తాప్సి నాయికలు. దశరథ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇటీవలే 50 రోజుల మార్కు అందుకొంది.

ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ''పైరసీ బెడద ఎక్కువగా ఉంది. మరోవైపు కొత్త చిత్రాల తాకిడి. వీటి మధ్య కూడా మా 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' విజయం సాధించడం ఆనందంగా ఉంది. ప్రభాస్‌ని ఇది వరకు చూడని కోణంలో చూపించాం. నటీనటుల సహకారం, సాంకేతిక నిపుణుల నైపుణ్యం విజయాన్ని తెచ్చిపెట్టాయి. 130 కేంద్రాలలో యాభై రోజులు పూర్తిచేసుకొని వంద రోజుల వైపు పరుగులు తీస్తోంది. మంచి చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు అనేదానికి మా సినిమానే నిదర్శనం'' అన్నారు.

English summary
Prabhas movie MR Perfect released on April 22nd. Kajal Agarwal and Tapsi are the female leads, and the movie is Produced by Dil Raju under Sri Venkateswara Creations and Directed by Dasarath.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu