»   » అభిమానికి టిస్కా చోప్రా పంచ్ అదిరింది... ఈ సమాధానం చూసి నవ్వకుండా ఉండలేరు

అభిమానికి టిస్కా చోప్రా పంచ్ అదిరింది... ఈ సమాధానం చూసి నవ్వకుండా ఉండలేరు

Posted By:
Subscribe to Filmibeat Telugu

42 సంవత్సరాల వయసు దాటినా ఇప్పటికీ చాలా సెక్సీగా కనిపిస్తూ ఉంటుంది బాలీవుడ్ భామ టిస్కా చోప్రా.. అయితే ఈ మధ్య ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఓ స్టార్ హీరో తనతో నన్ను పడుకోమన్నాడని ఒక రోజు, రెండు రోజులు కాదు.. ఏకంగా మూడు నెలల పాటు అతనితో సెక్స్ లో పాల్గొంటే సినిమా హీరోయిన్ చాన్స్ ఇస్తానన్నాడని సంచలన ఆరోపణలు చేసింది బాలీవుడ్ భామ. బాలీవుడ్ చిత్రాలతో పాటు తెలుగులో 'మల్లెపువ్వు', 'బ్రూస్లీ' ,సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాల్లో కనిపించిన టిస్కా చోప్రా అప్పట్లో అవకాశాలు రావాలంటే తమతో గడపాల్సిందే అనే హీరోలూ, దర్శకులూ ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.

Mrs.Tisca Chopra's Hilarious Reply To a marriage proposal

హీరోయిన్ కావాలంటే దర్శకుడు, హీరోలను శాటిస్పై చెయ్యాల్సిందే అంటూ ఆమె అన్నమాటలు అందరినీ షాక్ కు గురి చేసాయి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న చీకటి కోణాన్ని మరోసారి బయట పెట్టింది. సినిమా హీరోయిన్స్ అనగానే అన్ని రకాల విలాసవంతమైన జీవితం గడుపుతారనే అపోహ ఉందని.. వాస్తవానికి అది కొంత మందికి మాత్రమేనని ..కానీ కొంత మందికి ఎన్నో నరకాలు, ఛేదు అనుభవాలు, కష్టాలు కన్నీళ్లు వుంటాయని అంటోంది.. పాపం కొంత మంది బి గ్రేడ్ హీరోయిన్లు ఇలాంటి వారి చేతిలో మోసపోతున్నారని, అలా లొంగిపోయిన వారిని అనుభవించి వారిని వ్యభిచార కూపంలోకి నెట్టివేసిన సంఘనలు చాలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసిన టిస్కా మళ్ళీ ఎక్కువ వార్తల్లో కనిపించలేదు.

Mrs.Tisca Chopra's Hilarious Reply To a marriage proposal

ఇప్పుడు తాజాగా ఒక చిలిపి కామెంట్ తో మళ్ళీ సోషల్‌మీడియా లో పాపులర్ అయ్యింది. సోషల్‌మీడియా వాడకం పెరిగాక సినిమా స్టార్లు అభిమానులతో మరింత మమేకమవుతున్నారు. ప్రతి చిన్న విషయాన్ని అభిమానులతో పంచుకుటుంటారు. ఈ నేపథ్యంలో ఒక్కోసారి అభిమానుల నుంచి ఊహించని కామెంట్లు కూడా వస్తుంటాయి. బాలీవుడ్ అందాల భామ టిస్కా చోప్రాకు కూడా ఓ అభిమాని నుంచి సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. ట్విట్టర్‌లో అమ్మడి ఫొటోలను చూసి రాహుల్ అనే అభిమాని పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. అయితే 42 ఏళ్ల టిస్కాకు సంజయ్ చోప్రా భర్తగా ఉన్నాడనే విషయం తెలీక ఆ అభిమాని ఈ పనిచేశాడో లేక కావాలనే ట్వీట్ పెట్టాడోగానీ... అతడి ప్రపోజల్‌పై అమ్మడు మాత్రం కాస్త కొంటెగా స్పందించింది.

''మా ఆయన ఒప్పుకుంటే నాకు అభ్యంతరం లేదు. మీ పూర్తి వివరాలు పంపించండి. నెను ఎవరితో ఉండాలనుకుంటున్నానో అతణ్ని మా ఆయన కూడా చూడాలనుకుంటున్నారు.'' అని సమాధానమిచ్చింది. ఆ సమాధానానికి కళ్ళు బైర్లు కమ్మాయో ఏమోగానీ సదరు రాహుల్ అనే అభిమాని మళ్ళీ స్పందించలేదు. అదే మరి అల్లా టప్పా అమ్మాయిలని కదిపినట్టు ఈ ఫైర్ బ్రాండ్ లనికదిపితే రెస్పాన్స్ ఇలాగే ఉంటుంది మరి.

English summary
Tisca Chopra got a marriage proposal on Twitter, and the actress, who is already married to Sanjay Chopra, said yes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu