క్రికెటర్ ఎం.ఎస్. ధోనీపై సినిమా: హీరోయిన్ ఎవరు?

By Bojja Kumar

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని జీవిత కథతో బాలీవుడ్ దర్శకుడు నీరజ్‌ పాండే ఓ చిత్రాన్ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరో. ‘ఎంఎస్ ధోని-ది అన్ టోల్డ్ స్టోరీ' అనేది టైటిల్. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది.

మహేంద్రసింగ్ ధోనీ భార్య సాక్షి సింగ్ ఈ పోస్టర్ తన ట్విట్టర్ ద్వారా అప్పట్లో విడుదల చేసింది. పోస్టర్లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 7వ నెంబర్ గల టీమిండియా జెర్సీ ధరించాడు. 7 నెంబర్ అనేది ధోనీకి చాలా స్పెషల్. ఎందుకంటే ధోనీ పుట్టిన రోజు 7/7/1981.

‘MS Dhoni- The Untold Story' lead actress?

అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించేది ఎవరు? అనేది హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్ హీరోయిన్ అలీయా భట్, శ్రద్ధా దాస్, దోయేయ్ హీరోయిన్ క్రితి సనన్ పరేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని అక్టబర్ 22, 2015 నాటికి విడుదల చేయాలని దర్శకుడు నీరజ్ పాండే ప్లాన్ చేస్తున్నారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ఫ్లోర్ మీదకు వెళ్లనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటు సినీ ప్రియులతో పాటు, అటు క్రికెట్ అభిమానులు కూడా ఈ చిత్రంపై ఆసక్తి చూపుతారు కాబట్టి మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు. ఇటీవల క్రీడాకారుల జీవితాలపై తీసిన....‘భాగ్ మిల్ఖా భాగ్', ‘మేరీ కోమ్' లాంటి చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. దేశంలో క్రికెట్ ను అభిమానించే వారి సంఖ్యే ఎక్కువ కాబట్టి ఈ చిత్రానికి భారీ స్పందన వస్తుందని ఆశిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X