»   » ఎంఎస్ నారాయణ ‘క్రేజీవాలా’ ప్రారంభం (ఫోటోలు)

ఎంఎస్ నారాయణ ‘క్రేజీవాలా’ ప్రారంభం (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రజనీకాంత్ రోబో, బాలకృష్ణ సింహా, ఎన్టీఆర్ కంత్రి, రామ్ చరణ్ మగధీర పాత్రలను అనుకరిస్తూ......వివిధ సినిమాల్లో తెలుగు కమెడియన్ ఎంఎస్ నారాయణ ప్రదర్శించిన పేరడీలు ఎంత పాపులర్ అయ్యాయో కొత్తగా చెప్పక్కర్లేదు. దూకుడు సినిమా హిట్ కావడంతో ఎంఎస్ నారాయణ ప్రదర్శించిన ఈ పేరడీలు ముఖ్య పాత్రలు పోషించాయి.

తాజాగా ఎమ్మెస్ నారాయణ మరో పేరడీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సారి ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు 'అరవింద్ కేజ్రీవాల్'ను అనుకరించబోతున్నారు. 'క్రేజీవాలా' పేరుతో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో ఎంఎస్ నారాయణ టైటిల్ రోల్ చేయబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది.

ప్రముఖ నిర్మాత డి రామానాయుడు తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు. పరుచూరి గోపాలకృష్ణ దంపతులు కెమెరా స్విచాన్ చేసారు. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన వివరాలు...

దర్శకుడు మాట్లాడుతూ...

దర్శకుడు మాట్లాడుతూ...


ఇది పూర్తిగా పొలిటికల్ సినిమా. రాజకీయానికి సంబంధించని విమర్శ కాదు. వ్యంగాస్త్రం కూడా కాదు. కేవలం రాజకీయాలనే ప్రస్తావించే సినిమా. అసలు రాజ్యాంగం అంటే ఏమిటి? ఏ ఉద్దేశ్యం మీద రాజ్యాంగం ఉంది. దాన్ని ఎలా ఉపయోగించుకుంటే పాలన సక్రమంగా ఉంటుంది? ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఎలాంటి మార్పు కావాలి అనే అంశాలతో ఓటర్లకు అవగాహన కల్పించే విధంగా సినిమా ఉంటుందని తెలిపారు.

ఎంఎస్ నారాయణ మాట్లాడుతూ...

ఎంఎస్ నారాయణ మాట్లాడుతూ...

ఈ చిత్రం కాంటెంపరరీ సమస్యలతో తెరకెక్కిస్తున్న సినిమా. ఇందులో ప్లాబ్లం చెప్పి, సొల్యూషన్ కూడా చెబుతారు. ఓటర్లలో ప్రగతిని తీసుకురావడానికి తెరకెక్కిస్తున్నాం అన్నారు.

దర్శక నిర్మాతలు

దర్శక నిర్మాతలు

సౌండ్ ఎన్ క్లాప్ బ్యానర్లో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి మోహన ప్రసాద్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్ర కథను కూడా ఆయనే సిద్ధం చేసుకున్నారు. జి విజయ్ కుమార్ గౌడ్ నిర్మాత.

ఆకట్టుకుంటున్న ఎంఎస్ నారాయణ

ఆకట్టుకుంటున్న ఎంఎస్ నారాయణ

ఎంఎస్ నారాయణ కేజ్రీవాల్ గెటప్పులో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. సినిమా పూర్తి వినోదాత్మకంగా సాగుతుందని తెలుస్తోంది. కేజ్రీవాల్‌పై పేరడీగా ఈ సినిమా వస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

నటీనటులు

నటీనటులు

ఈ నెల 24 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలువుతుంది. నాగబాబు, పరుచూరి గోపాలకృష్ణ, షఫి, ఖడ్గం పృథ్విరాజ్, గౌతం రాజు, ఉత్తేజ్ ఇతర పాత్రధారులు. కెమెరా: భరణి కె.ధరణ్, సంగీతం: సునీల్ కశ్యప్, ఆర్ట్: కృష్ణ, ఎడిటర్: రమేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాలాజీ శ్రీను.

English summary
MS Narayana Krejiwala movie launched. The movie directed by Mohana Prasad. MS Narayana play as Krejiwala.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu