twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫేస్ బుక్ పై ఎమ్మెస్‌ నారాయణ కామెడీ స్కిట్ (వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్‌: ఫేస్ బుక్ లో ఫేస్ లు మార్చి ఒకరినొకరు మోసం చేసుకోవటంపై ఎమ్మెస్ నారాయణ ప్రదర్శించిన కామెడీ స్కిట్ అందరి మన్ననలూ పొందింది. తుపాను బాధితుల సహాయం కోసం హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేసిన మేముసైతం... కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. హాస్యనటుడు ఎమ్మెస్‌ నారాయణ ప్రదర్శించిన లఘు నాటిక హాస్యపు జల్లులు కురిపించింది. ఆ స్కిట్ మీకూ చూడాలని ఉందా..చూడండి...

    హుద్‌హుద్‌ తుపాను బాధితుల సహాయార్థం సినీతారలు చేపట్టిన మేముసైతం కార్యక్రమం హైదరాబాద్‌లో అట్టహాసంగా కొనసాగుతోంది. కృష్ణానగర్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో నటీనటులంతా వారి వారి శైలిలో వినోద కార్యక్రమాల్లో పాల్గొని ప్రేక్షకులను అలరిస్తున్నారు.

    హుదు హుద్‌ తుపాను బాధితుల సహాయార్థం చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేసిన మేము సైతం కార్యక్రమం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అనంత శ్రీరామ్‌ రచించి, సంగీత దర్శకుడు కోటి స్వరపరిచిన మేము సైతం... గీతాన్ని పలువురు గాయకులు ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు.

    MS Narayana Skit on Face book

    అలాగే...ప్రజలకు ఎప్పుడు కష్టం వచ్చినా తెలుగు చలనచిత్ర పరిశ్రమ అండగా ఉంటుందని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న దాసరి మాట్లాడుతూ... గతంలో విపత్తులు సంభవించినప్పుడు చిత్ర పరిశ్రమ ద్వారా అందించిన సాయం వివరాలను గుర్తు చేశారు. 1977 దివిసీమ ఉప్పెన సమయంలో, రాయలసీమ కరవు సమయంలో చిత్ర పరిశ్రమ పలుకార్యక్రమాలు ఏర్పాటు చేసి విరాళాలు సేకరించిందన్నారు.

    తుపాను బాధితుల కోసం అప్పట్లో ఎన్టీఆర్‌ జోలెపట్టి విరాళాలు సేకరించారని గుర్తు చేశారు. సినీనటుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ... తుపాను బాధితుల సహాయం కోసం కళాకారులు వ్యక్తిగతంగా విరాళాలు ఇచ్చినప్పటికీ, చిత్ర పరిశ్రమ ద్వారా అందరం కలిసి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయని పి.సుశీల బాధితుల కోసం రూ.లక్ష విరాళాన్ని ప్రకటించారు.

    కార్యక్రమంలో సినీ నటులు బాలకృష్ణ, మోహన్‌బాబు, నాగార్జున, వెంకటేష్‌, మురళీమోహన్‌, మంచు విష్ణు, దర్శకులు దాసరినారాయణరావు, రాఘవేంద్రరావు, నిర్మాత అల్లు అరవింద్‌, సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Ms Narayana, Utej Comedy Skit On Facebook at Memu Saitam Event. Tollywood’s special event for Hudhud victim relief fund “Memu Saitham – We Love Vizag” will be held on 30th of November. This 12 hours nonstop grand event will be a memorable one. It will be a eye feast for Tollywood fans to see all the stars on one stage.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X