»   »  నటుడుగా ఎమ్మెస్ రాజు

నటుడుగా ఎమ్మెస్ రాజు

Posted By:
Subscribe to Filmibeat Telugu
MS Raju
సస్పన్స్ చిత్రాలతో ప్రపంచాన్ని తన వైపుకి తిప్పుకుని మరిచిపోలేని హిట్స్ ఇచ్చిన ప్రముఖ దర్శకుడు హిచ్ కాక్ .ఆయన తన సినిమాల్లో ఎక్కడో చోట కనపడటం అలవాటు. అది ఎంత పాపులర్ అయిందంటే ఈయన ఏ పాత్రలో ఎప్పుడు కనపడతాడా అని సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఆసక్తిగా ఎదురుచూసేవారట. అలా ఒకసారి ఓ సస్పన్స్ సినిమా చేస్తుంటే ప్రేక్షకుల దృష్టి మొత్తం కథ వైపు కాకుండా తనవైపుకు తిరగుతుందని భయం వేసి మొదటి సీనులోనే కనపడ్డాడట. అలాగే ఈ మధ్య దర్శకుడు గానూ మారిన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత, భారీ చిత్రాల నిర్మాత అయిన ఎమ్మెస్ రాజు తన చిత్రాల్లో అక్కడక్కడా కనపడటం అలవాటే.

ఇక ఇప్పుడు ఆయన బయట చిత్రంలోనూ కనిపించనున్నారు. శేఖర్ కమ్ముల శిష్యుడు సాయికిరణ్ దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందిస్తున్న చిత్రం 'వినాయకుడు' లో ఆయన ఒక చిన్న పాత్రలో కనిపిస్తారు. 'హ్యాపీడేస్'లో స్రవంతిగా నటించి అందర్నీ ఆకట్టుకున్న సోనియా ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా, హీరోగా కృష్ణుడు పరిచయమవుతున్నాడు. మే 2న సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇటీవలే ముగిసింది. రెండో షెడ్యూల్ జూన్ తొలి వారం నుంచి 20 వరకు జరుగనున్నది. 'ఆ నలుగురు' వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాను అందించిన ప్రేమ్ మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X