For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కొట్టుకుంటూ ప్రేమించుకుంటూ...('తూనీగా తూనీగ 'ప్రివ్యూ)

  By Srikanya
  |
  ప్రముఖ నిర్మాత ఎం.ఎస్‌.రాజు కుమారుడు సుమంత్‌ అశ్విన్‌ హీరోగా పరిచయం చేస్తూ తీసిన 'తూనీగా తూనీగ' ఈ రోజే (శుక్రవారం) విడుదల అవుతోంది. వానతో దర్శకుడుగా మారిన ఎమ్.ఎస్ రాజు ఈ చిత్రాన్ని తానే డెరైక్ట్ చేసారు. విడుదల సందర్భంగా దర్శకుడు ఎమ్‌.ఎస్‌.రాజు మాట్లాడుతూ ''భిన్నమైన నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. ఆ ఇద్దరి ప్రేమికుల మధ్య చోటు చేసుకొనే భావోద్వేగాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. కార్తీక్‌ రాజా సంగీతం ఆకట్టుకొంటుంది''అన్నారు.

  కథలో .. సంగీతమే ప్రాణంగా భావించే యువకుడు కార్తీక్‌ రామస్వామి (సుమంత్‌ అశ్విన్‌). ఆ యువకుడికి కొన్ని లక్ష్యాలుంటాయి. వాటిని చేరుకొనే క్రమంలోనే నిధి (రియా) పరిచయమవుతుంది. అది కాస్తా ప్రేమగా మారుతుంది. నిధి అభిరుచులు భిన్నమైనవి. జంతువులంటే ఎంతో ఇష్టాన్ని ప్రదర్శిస్తుంటుంది. వీళ్ళిద్దరికీ ఒక్క క్షణం కూడా పడదు. ఇద్దరి మధ్య మంచి నీళ్లు ఉన్నా కూడా పెట్రోలై మండుతుంది. 'నువ్వెంత అంటే నువ్వెంత' అనుకొంటూ పోట్లాడుకోవల్సిందే. ఒకరిని ఓడించడానికి మరొకరు ఎత్తులు వేస్తుంటారు. అలాంటిది ఇద్దరూ ఒక చోట కలిసుండాల్సిన పరిస్థితి వస్తుంది. పెద్దవారి కోసం స్నేహం నటించాల్సి వస్తుంది. అప్పుడేం చేశారు? కొత్తగా వచ్చిన పిలుపులు, పలకరింపులు... వారి మధ్య ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయి అనేది మిగతా కథ.

  సమర్ఫకుడు దిల్ రాజు మాట్లాడుతూ...మేకర్‌గా ఎమ్మెస్ రాజు ప్రతిభ ఏమిటో తెలుసు. వాళ్ల అబ్బాయినే హీరోగా పరిచయం చేస్తున్నారు కాబట్టి కచ్చితంగా బాగుంటుందనే ఉద్దేశంతో మాగంటి రాంజీతో పాటు నిర్మాణంలో నేనూ పాలు పంచుకున్నా. నా సొంత సినిమాకి ఎలాగైతే అన్ని విషయాలూ చూసుకుంటానో అలాగే ఈ సినిమాకీ చేయాలని నిర్ణయించుకుని 70 శాతం షూటింగ్ అయ్యాక రషెస్ చూపించమన్నా. అప్పటికి క్లైమాక్స్, కొన్ని కీలక సన్నివేశాలు తియ్యలేదు. అందులో పొరబాట్లుగా నాకు అనిపించినవీ, నాకు కలిగిన సందేహాలనూ చెప్పాను. రచయితలు పరుచూరి బ్రదర్స్‌తో చర్చించా. ఈ సినిమాని సూపర్‌హిట్ చెయ్యాలంటే ఏం చెయ్యొచ్చో వాటిని అందరినీ కూర్చోపెట్టి చర్చించాను. అప్పటివరకు జరిగిన షూటింగ్‌లో ఎక్కడ మార్పులు చెయ్యాలో, తర్వాత కథ ఎలా ఉండాలో అందరం కలిసి నిర్ణయించుకున్నాం. రాజుగారు కూడా కన్విన్స్ అయ్యారు. దానికి తగ్గట్లే సినిమా తీశారు అన్నారు.

  సంస్థ: పద్మిని ఆర్ట్స్‌
  నటీనటులు: సుమంత్‌ అశ్విన్‌, రియా, పరుచూరి వెంకటేశ్వరరావు, ప్రభు, నాగబాబు, విజయ్‌చందర్‌, సాయాజీ షిండే తదితరులు
  మాటలు: పరుచూరి బ్రదర్స్‌,
  కెమెరా: ఎస్‌.గోపాల్‌రెడ్డి,
  కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: ఎం.ఎస్‌.రాజు
  సమర్పణ: దిల్‌ రాజు,
  నిర్మాత: మాగంటి రామ్‌చంద్రన్‌ (రామ్‌జీ),
  విడుదల: శుక్రవారం.

  English summary
  
 M.S.Raju's directorial venture " Tuneega Tuneega" is relesing today. MS Raju said that the film is a romantic entertainer which has his son Sumanth Ashwin and Rhea in the lead pair.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X