»   » జూ.ఎన్టీఆర్ కి క్షమాపణ చెప్తానంటున్నారా?

జూ.ఎన్టీఆర్ కి క్షమాపణ చెప్తానంటున్నారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రతి ఒక్కరితో నేను మంచి అనిపించుకోవాలనే స్వార్థం నాకు లేదు. అయితే కొందరు సినిమా వాళ్ల మనసు నొచ్చుకుందని తెలిసింది. వారికి బేషరతుగా క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని అని ప్రముఖ నిర్మాత కవి ఎమ్.ఎస్ రెడ్డి అన్నారు.ఆయన రీసెంట్ గా వెలువరించిన 'ఇదీ నా కథ'పుస్తకంలో జూ.ఎన్టీఆర్,గుణశేఖర్ వంటి వారిని ఆయన విమర్శలు,ఆరోపణలు చేసారు.ఈ నేపధ్యంలో వివాదం చెలరేగింది.దాంతో ఆయన ఇలా స్పందించారు. అలాగే..

యదార్థం లోక విరుద్ధం అన్నట్లు నా జీవిత చరిత్రపై కొన్ని ఛానెళ్లు ఇష్టమొచ్చినట్లు ప్రచారం చేసి నా బతుకు బజారుకీడ్చాయి. నా ఆత్మసాక్షిగా చెబుతున్నా.. 'ఇదీ నా కథ'లో నేను రాసిన ప్రతి అక్షరం నిజం అన్నారు ఎమ్.ఎస్.రెడ్డి.ఇక జీవితచరిత్ర రాయడం అనేది కత్తి మీద సాములాంటిది. దానివల్ల అనేక ఇబ్బందులు వస్తుంటాయి అన్నారు .

English summary
‘Idi Naa Katha,’ the book from Mallemala Sundara Rami Reddy (ms reddy) is creating a wave in Tollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu