»   » నిహారిక ఎపిసోడ్ కు అప్పుడే ‘శుభం’ కార్డు పడింది!

నిహారిక ఎపిసోడ్ కు అప్పుడే ‘శుభం’ కార్డు పడింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగ బాబు కూతురు నిహారిక నటించిన వెబ్ సిరీస్ 'ముద్దపప్పు ఆవకాయ'కు మంచి స్పందన వస్తోంది. సంక్రాతికి తొలి ఎపిసోడ్ రిలీజ్ కాగా.... ఇప్పటి వరకు 5 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. ప్రతి ఎపిసోడ్ నెక్ట్స్ ఎపిసోడ్ కోసం ఎదురుచూసేలా చేసింది ప్రేక్షకులను. నిహారిక, ఇతర తారగణం నటన, ప్రణీత్ దర్శకత్వం నెటిజన్లను, ముఖ్యంగా యువతను కట్టిపడేసింది. ఇప్పటి వరకు రిలీజైన 5 ఎపిసోడ్లకు కలిపి దాదాపు 70 లక్షల వ్యూస్ వచ్చాయి.

నాగ బాబు కూతురు నిహారికపై హరాస్మెంట్ కేసు వేస్తాం!

అయితే ఐదో ఎపిసోడ్ అయిపోగనే 'శుభం' కార్డు వేయడాన్ని బట్టి...... 'ముద్దపప్పు ఆవకాయ్' వెబ్ సిరీస్ ముగిసినట్లు స్పష్టమవుతోంది. ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న వెబ్ సిరీస్ కేవలం 5 ఎపిసోడ్లకే ముగించడంపై నెటిజన్లు అసహనంతో ఉన్నారు. ఇంకొన్ని ఎపిసోడ్లు ఉంటే బావుండు అనే భావన తమ కామెంట్ల రూపంలో వ్యక్తం చేసారు.

Muddapappu Avakai Web Series Episode 5

నిహారిక టెర్మ్స్ అండ్ కండీషన్స్.... (రొమాంటిక్ వీడియో)

'ముద్ద అప్పు ఆవకాయ' కాన్సెప్టు చాలా చిన్నది కావడం.... ఇంతకంటే పొడగించడం వల్ల మరీ సాగదీసినట్లు ఉంటుందనే ఉద్దేశ్యంతో 5వ ఎపిసోడ్ తో శుభం కార్డు వేసారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై నిహారిక ఈ వెబ్ సిరీస్ నిర్మించారు. త్వరలోనే మరో వెబ్ సిరీస్ తో ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ముద్దు పప్పు ఆవకాయ్ వెబ్ సిరీస్ లో నిహారిక, ప్రతాప్, వర్ష, అదితి, హర్ష, మోహన్, ధనలక్ష్మి, లీరిషా, హుస్సేన్ షా కిరణ్, సంజీవ్, సంజన, వింధ్య తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఎవరికి వారు తమ పాత్రలకు అనుగుణంగా మంచి నటన చూపించారు. ముద్ద పప్పు ఆవకాయ వెబ్ సిరీస్ కు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: విద్యాసాగర్ & అఖిలేష్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: నాని, ప్రొడక్షన్ హెడ్: నిఖిల్, అసిస్టెంట్ డైరెక్టర్స్: ప్రశాంత్, సాయి, మ్యూజిక్: కార్తీక్, దర్శకత్వం: ప్రణీత్ బ్రామందపల్లి.

English summary
Watch Episode 05 of Muddapappu Avakai - The first ever telugu Web Series Starring Niharika Konidela, Pratap, and the Series is directed by Pranith. Bramandapally.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu