»   » 1000 కోట్లతో అమీర్‌ఖాన్ మహాభారతం.. నిర్మాతగా ముఖేష్ అంబానీ.!

1000 కోట్లతో అమీర్‌ఖాన్ మహాభారతం.. నిర్మాతగా ముఖేష్ అంబానీ.!

Written By:
Subscribe to Filmibeat Telugu
కొత్త సంచలనానికి నాంది పడుతోందా ?

మహాభారతం కథను వెండితెరపైకి ఎక్కించాలనేది ఎప్పటి నుంచో అమీర్‌ఖాన్‌కు కల. మహాభారతాన్ని ఎవరు తీసినా అందులో పాత్రను పోషించడానికి సిద్ధమేనని ఆ మధ్య అన్నారు. ఒకవేళ రాజమౌళి మహాభారతం చిత్రాన్ని రూపొందిస్తే అందులో అర్జునుడి పాత్రను పోషించాలని ఉందని అమీర్ చెప్పారు. ప్రస్తుతం అమీర్ థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ అనే వినూత్నమైన చిత్రాన్ని తెరకక్కిస్తున్నాడు. అయితే అమీర్ సుదీర్ఘకాలం కల మహాభారతం గురించి బాలీవుడ్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతున్నది.

ముఖేష్ అంబానీ సహనిర్మాతగా

ముఖేష్ అంబానీ సహనిర్మాతగా

మహాభారతాన్ని అమీర్‌ఖాన్ అత్యంత భారీ బడ్జెట్‌తోపాటు, ప్రతిష్ఠ్మాత్మకంగా రూపొందించే ఆలోచనలో ఉన్నారు. దాదాపు ఆ చిత్ర బడ్జెట్ రూ.1000 కోట్లు. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌కు ముఖేష్ అంబానీ సహనిర్మాతగా వ్యవహరించనున్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అని బాలీవుడ్ పత్రిక ఆ కథనంలో పేర్కొన్నారు.

ఐదు భాగాలుగా

ఐదు భాగాలుగా

హాలీవుడ్‌లో సంచలనం రేపిన లార్డ్ ఆఫ్ రింగ్స్ మాదిరిగానే ఈ చిత్రాన్ని మూడు నుంచి ఐదు భాగాలుగా రూపొందించనున్నారట. ఒక్కో భాగానికి ఒక్కో దర్శకుడు పనిచేస్తాడట. ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రూపొందించడానకి హాలీవుడ్ రచయితలు పనిచేయనున్నట్టు సమాచారం.

రాకేష్‌శర్మ బయోపిక్

రాకేష్‌శర్మ బయోపిక్

వాస్తవానికి అమీర్‌ఖాన్‌ శాస్త్రవేత్త రాకేష్ శర్మ బయోపిక్‌లో నటించాల్సింది. అయితే మహాభారతం కారణంగా ఆ చిత్రం నుంచి తప్పుకొన్నట్టు సమాచారం. దాదాపు మరో పదేళ్ళు మహాభారతం చిత్రంతోనే అమీర్‌ఖాన్ కెరీర్‌ ముడిపడి ఉన్నదనే మాట వినిపిస్తున్నది. ప్రస్తుతం మహాభారతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్టు తెలిసింది.

నాకు కర్ణుడు పాత్ర అంటే

నాకు కర్ణుడు పాత్ర అంటే

మహాభారతంలో నా ఫేవరేట్ క్యారెక్టర్ కర్ణుడు. నా దేహాధారుడ్యం ఆ పాత్రకు సరిపోతుందో లేదో నాకు తెలియదు. అంతేకాకుండా నాకు కృష్ణుడి పాత్రను పోషించాలని ఉంది. అంతేకాకుండా అర్జునుడి పాత్ర అంటే కూడా ఇష్టం అని అమీర్ ఖాన్ ఇటీవల అన్నారు.

English summary
Aamir's grandest and most ambitious endeavour Mahabharata, with a lavish budget of over Rs 1,000 crore. Apparently, Mukesh Ambani is all set to co-produce Aamir's dream project, and an insider revealed that it would be a "one-off" engagement.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X