twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ, పవన్ ల గురించి ముఖేష్ రుషి

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేని తెలుగు విలన్ ముఖేష్‌ రుషి. దాదాపు అందరి స్టార్ హీరోలతో విలన్ గా చేసిన ముఖేష్ రుషి కి తెలుగు ఫీల్డ్ అంటే మమకారం. మొదట్లో విలన్ రోల్స్ వేసినా తర్వాత తర్వాత మెల్లిగా...తండ్రి,మామ పాత్రలకు ఆయన చేసి మెప్పించటం మొదలెట్టారు. ఆయనలోని డెడికేషన్ ఆయన్ని ఈ స్థితికి తెచ్చిందని చెప్తారు. ఆయన సెట్లో ఉంటే చాలా డిసిప్లెయిన్డ్ గా ఉంటారని తోటి ఆర్టిస్టులు చెప్తూంటారు. ఆయన తన అనుభవాలను రీసెంట్ గా మీడియాతో పంచుకున్నారు.

    తన తొలి అవకాసం గురించి చెప్తూ... 'దర్శకుడు ప్రియదర్శన్‌ మాంచి బాడీ ఉన్న నటుడి కోసం చూస్తున్నారట. నువ్వు వెళ్లొచ్చు కదా' అని నా మిత్రుడు చెప్పాడు. వాడు చెప్పిన వెంటనే ప్రియదర్శన్‌ని కలిశాను. ఆయన నన్ను చూసీ చూడగానే ''గర్దిష్‌'లో విలన్‌ వేషం ఉంది... చేస్తావా'' అన్నారు. రెండో ఆలోచన లేకుండా ఓకే అనేశాను. హీరో కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. నటనలో శిక్షణ పొందుతున్నప్పుడు కూడా ఈ ఆలోచన లేదు. అలాగని విలన్‌ వేషాలే వెయ్యాలనీ నిర్ణయించుకోలేదు. సినిమాల్లో నటించాలి... అంతే! అందుకే, వేరే ఏ ఆలోచనా లేకుండా 'గర్దిష్‌'లో నటించాను అన్నారు.

    ఆ ఆనందం గురించి చెప్తూ.... ''గర్దిష్‌' సినిమా రిలీజ్‌కి ముందు రోజు పాత్రికేయుల కోసం వర్లిలో ఒక షో వేశారు. తెరమీద నన్ను నేను తొలిసారి చూసుకునేసరికి... ఏదో చెప్పలేని ఫీలింగ్‌. ఇంటర్‌వెల్‌ అయ్యేసరికి నన్ను అందరూ గుర్తుపట్టడం మొదలుపెట్టారు. నాకెందుకో భయం వేసింది. సినిమా పూర్తవకుండానే థియేటర్‌ నుంచి బయటకి వచ్చేసి నా కారులో ముంబైలోని తాజ్‌ హోటల్‌ వరకూ వచ్చేశాను. అక్కడికి వచ్చాక గుర్తొచ్చింది... సినిమా అయ్యాక ప్రెస్‌మీట్‌ ఉంది కదా అని. అది ఆనందమో భయమో కలనిజమైందన్న సంతోషమో... ఏదో ఎమోషన్‌ నన్ను మైమరపించిన క్షణం అది. ఆ రోజు ఇప్పటికీ గుర్తుంది అని చెప్పుకొచ్చారు.

    తెలుగు హీరోల గురించి స్లైడ్ షో లో...

    బాలకృష్ణ

    బాలకృష్ణ

    'నరసింహనాయుడు' నుంచి ఆయనతో పరిచయం. చాలా మంచి వ్యక్తి. ఆయనతో మాట్లాడుతుంటే ఒక ఆత్మీయుడితో ఉన్నట్టు ఉంటుంది. పెద్ద స్టార్‌ పక్కన నిలబడ్డామన్న ఫీలింగ్‌ ఉండదు. ఈ మధ్యనే ఆయన చేతుల మీదుగా ఓ అవార్డు కూడా అందుకున్నాను అన్నారు. నరసింహ నాయుడు చిత్రం తర్వాత బాలకృష్ణ చాలా చిత్రాల్లో ఆయన నటించారు.

    చిరంజీవి

    చిరంజీవి

    చిరంజీవి స్నేహపూర్వకంగా ఉంటారు. ముంబైలో మేము ఉంటున్న ప్రాంతంలో ఎంతోమంది తెలుగు రాకపోయినా సరే 'ఇంద్ర' సినిమా చూశారు. అక్కణ్నుంచి చిరంజీవి అభిమానులైపోయారు. వాళ్ల ఇళ్లలో చిరంజీవి సినిమాల డీవీడీలు చాలానే కనిపిస్తుంటాయి అని చెప్పుకొచ్చారు.

    పవన్‌ కల్యాణ్‌

    పవన్‌ కల్యాణ్‌

    పవన్ చాలా తక్కువ మాట్లాడతారు. అయితే, తనకి ఇష్టమైన టాపిక్స్‌ చర్చకి వస్తే ఆయన ఎంతో సరదాగా మాట్లాడతారని తెలుస్తుంది. మా మధ్య ఎక్కువగా పుస్తకాల గురించీ వ్యాయామాల గురించీ చర్చలు జరుగుతుంటాయి అని చెప్పారు. పవన్ తాజా చిత్రంలోనూ ఆయన కీలకమైన పాత్ర పోషించారు.

    యంగ్ హీరోలు

    యంగ్ హీరోలు

    ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, బన్నీ... ఇలా ఈతరం హీరోలందరిలోనూ ఎనర్జీ లెవెల్స్‌ బాగుంటాయి. సెట్స్‌లో కష్టపడే తీరు చాలా బాగుంటుంది. వారినిచూస్తే ముచ్చటేస్తుంది. వీరందరితో పనిచేయటం అదృష్టమనిపిస్తుంది అన్నారు.

    మహేష్ తో ..

    మహేష్ తో ..

    మహేష్ బాబు చిత్రం 'ఒక్కడు'లో మహేష్‌బాబు తండ్రి పాత్రలో నటించమని దర్శకుడు గుణశేఖర్‌ అడిగారు. ఆ సినిమాతో నాకు పాజిటివ్‌ ఇమేజ్‌ వచ్చింది. అక్కణ్నుంచి విలన్‌ పాత్రలతోపాటూ సెంటిమెంట్‌ వేషాలూ వస్తున్నాయి. అన్నిటినీ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. వాళ్ల ప్రేమాభిమానాలకు ఎంతో రుణపడి ఉంటాను అన్నారు. మహేష్ బాబు ఫెరఫార్మెన్స్ అద్బుతమని ఆయన అన్నారు.

    తొలి చిత్రం

    తొలి చిత్రం

    'గాండీవం' ...తెలుగులో నా తొలిచిత్రం అది. ప్రియదర్శన్ వల్ల వచ్చిన అవకాశమే. అయితే, అందులో నాది తక్కువ నిడివి ఉన్న పాత్ర. తరువాత, హిందీలో వరుస అవకాశాలు రావడం మొదలైంది. అన్నీ విలన్‌ పాత్రలే. అమీర్‌ఖాన్‌ సినిమా 'సర్ఫరోష్‌'తో నటుడిగా నాకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగులో.. గుణశేఖర్‌ 'మనోహరం'లో అవకాశం ఇచ్చారు. అందులో ప్రధాన విలన్‌ పాత్ర. ఆ తరువాత బాలకృష్ణ చిత్రం 'నరసింహనాయుడు'లో నటించే ఛాన్స్‌ వచ్చింది. ఆ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయిందో తెలిసిందే. తరువాత 'ఇంద్ర'లో విలన్‌. అదీ గుర్తింపు తెచ్చింది. తమిళ, మలయాళీ, కన్నడ, ఒరియా, పంజాబీ, హిందీ... ఇలా వివిధ భాషల చిత్రాల్లోనూ విలన్‌ వేషాలు వచ్చాయి.

    యష్ ఛోప్రాతో ...

    యష్ ఛోప్రాతో ...

    కొన్ని సినిమాల్లో విలన్‌ వేషాలు వేశాక ఓసారి యశ్‌చోప్రాగారిని కలిశాను. మీ సినిమాల్లో విలన్‌ వేషాలుంటే నాకో అవకాశం ఇవ్వండని అడిగాను. ఆయన నా క్రమశిక్షణ గురించి విన్నారట. చాలా మెచ్చుకున్నారు. తరువాత... 'నా సినిమాల్లో విలన్లు ఉండరు కదా! ఏం చేద్దాం' అన్నారు. ఏం ఫర్వాలేదు సార్‌. మీకు విలన్‌ అవసరమైతే నన్ను పిలవండి అని చెప్పేసి వచ్చేశాను. ఆయన సినిమాల్లో నటించాలన్న కోరిక మాత్రం ఇప్పటికీ ఓ కలగానే మిగిలిపోయింది అన్నారు.

    అత్తారింటికి దారేది

    అత్తారింటికి దారేది

    ముఖేష్ రుషి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చిత్రం అత్తారింటికి దారేది పై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆ చిత్రంలో ఆయన మంచి రోల్ చేసినట్లు సమాచారం. ఆయన పాత్ర మరో స్ధాయిలో తన లోని నటుడ్ని తీసుకువెళ్తుందని భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఫ్యామిలీ నేపధ్యంలో నడిచే ఈ చిత్రంలో పవన్ కి, ముఖేష్ రుషికి మధ్య వచ్చే సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు.

    English summary
    Mukesh Rishi is an Indian film actor who has worked in Hindi, Telugu, Tamil, Malayalam and Kannada films. He got his first break in Tollywood in 1988 and has established himself as a leading character actor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X