»   »  ముఖ్యమంత్రి ఐ లవ్ యూ!!!

ముఖ్యమంత్రి ఐ లవ్ యూ!!!

Posted By:
Subscribe to Filmibeat Telugu


మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ బిజెపి సహకారంతో తన కొడుకును ముఖ్యమంత్రిని చేశాడు. ఒప్పందం ప్రకారం కుమారుడు కుమారస్వామి సమయం అయిపోయిన తరువాత ముఖ్యమంత్రిగా చేసే అవకాశం బిజెపిది. బిజెపికి అవకాశం ఇవ్వకుండా రాష్ట్రపతి పాలనకు కారణమైన దేవేగౌడ మళ్లీ మనసు మార్చుకుని బిజెపికి అధికారం కట్టబెట్టడానికి సిద్ధపడ్డాడు. యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయ్యాడు. షరతులకు ఒప్పుకోవల్సిందేనని లింక్ పెట్టి వారానికే యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేలా తన రాజనీతి ప్రదర్శించాడు దేవేగౌడ. ఈ పరిణామాలన్నీ సినిమాకు పనికొస్తాయనుకున్నారో ఏమో...కన్నడ సినిమా పరిశ్రమవారు దేవేగౌడ రాజనీతిని ఆధారంగా చేసుకుని సినిమా తీయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాకు ముఖ్యమంత్రి ఐ లవ్ యూ గా నిర్ణయించారు. ఈ సినిమా షూటింగ్ బెంగూళూరు ప్రెస్ క్లబ్ లో సోమవారం ప్రారంభం అయింది.

ముఖ్యమంత్రి పాత్రను హీరో విజయ్ పోషిస్తున్నాడు. హరిప్రియ, భావన హీరోయిన్లుగా చేస్తున్నారు. బెంగుళూరు, మాండ్యా, హసన్, న్యూఢిల్లీలలో ఈ సినిమా షూటింగ్ జరగనున్నది. రవి బెలగెరే దర్శకత్వం వహిస్తున్నారు. దేవేగౌడను పోలిన పాత్రపేరు సినిమాలో తంత్రే గౌడ. ఈ పాత్రను లోక నాథ్ పోషిస్తున్నాడు. రంగాయన రఘు దేవన్న పాత్రలో కనిపించనున్నాడు. హరికృష్ణ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా కథ పెద్ద సీక్రెట్ ఏమీ కాదని, ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే రూపొందుతోందని దర్శకుడు అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X