Don't Miss!
- News
మనీశ్ సిసోడియా ఇళ్లలో సోదాలు పూర్తి.. ఆర్టికల్‌పై కామెంట్ప్‌పై న్యూయార్క్ టైమ్స్ గుర్రు
- Sports
World Test championship: ఇంగ్లాండ్‌పై గెలుపుతో అగ్రస్థానంలో సౌతాఫ్రికా.. ఏ జట్టు ఏ స్థానంలో ఉందంటే?
- Technology
త్వరలో భారత్‌లోకి 180W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా గల మొబైల్!
- Lifestyle
Health Tips: Healthy Fatty Foods:ఈ కొవ్వు పదార్ధాలు మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడి, గుండెపోటును నివారిస్తాయి..
- Finance
Crorepati Tips: రూ.27 లక్షలకు 73 లక్షలు లాభం.. ఈ ఫార్ములాతో మీరే కోటీశ్వరులు.. పొదుపు పాఠాలు
- Automobiles
కొత్త 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు వెల్లవుతాయి.. ఎప్పుడంటే?
- Travel
బౌద్ధం.. జైనం.. గుంటుపల్లి చరిత్రలో నిక్షిప్తం
ఫ్యామిలీ ఆడియన్స్ కు గుడ్ న్యూస్.. సినిమా టికెట్ రేట్లతో పాటు తగ్గనున్న స్నాక్స్ రేట్లు!
తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు ఆలోచనలో పడింది. థియేటర్లకు ప్రేక్షకులకు రావడం లేదనే విషయం అర్థం చేసుకున్న నిర్మాతలు ఇప్పుడు పునరా ఆలోచనలో పడ్డారు. ఏం చేస్తే మళ్లీ థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా అనే అంశం మీద మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే తెలుగు సినిమాల షూటింగులు అన్నీ నిలిపివేసి ఈ విషయాల మీద శ్రద్ధ పెట్టారు నిర్మాతలు. ఇప్పటికే ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ గిల్డ్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వంటివి మీటింగ్ లు జరుపుతూ ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయం మీద చర్చలు జరుపుతున్నారు. అయితే ఇప్పుడు మరో సమస్య ఏమిటంటే మల్టీప్లెక్స్ థియేటర్లకు వెళితే నలుగురు ఉన్న ఒక కుటుంబానికి దాదాపు 1000 రూపాయలు ఖర్చవుతుంది.
తినుబండారాలు రేట్లు కూడా భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో సినిమా ధియేటర్లకు రావడానికి ఆసక్తి చూపించడం లేదు తెలుగు ప్రేక్షకులు. ఎలాగో నెలరోజులు దాటిన తర్వాత డిజిటల్ వేదికగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా అనే ధైర్యంతో వారు థియేటర్లకు రావడం లేదు.

ఈ విషయంలో ఇప్పుడు నిర్మాతలు మల్టీప్లెక్స్ యజమానులతో చర్చించేందుకు సిద్ధమయ్యారు అందులో భాగంగానే మల్టీఫ్లెక్స్ థియేటర్ల ప్రతినిధులతో ఫిల్మ్ చాంబర్ సమావేశం అయింది. తాజాగా ఫిల్మ్ చాంబర్ లో సమావేశానికి మల్టీఫ్లెక్స్ థియేటర్ల జాతీయ స్థాయి ప్రతినిధులు హాజరయ్యారు. ఇక ఈ సంధర్భంగా టికెట్ ధరలు, తినుబండరాలు, వసతులపై మల్టీఫ్లెక్స్ ప్రతినిధులతో ఫిల్మ్ చాంబర్ చర్చలు జరిపింది.
తెలుగు రాష్ట్రాల్లోని అన్ని మల్టీఫ్లెక్స్ లో తినుబండారాల ధరలు తగ్గించాలని ఫిల్మ్ ఛాంబర్ మల్టీఫ్లెక్స్ ల ప్రతినిధులకు సూచించింది. ధరలు, క్వాంటిటీ తగ్గించి ప్రేక్షకులకు అందుబాటులో ఉంచాలని మల్టీఫ్లెక్స్ ప్రతినిధులను ఫిల్మ్ చాంబర్ కోరింది. ఇక ఫిల్మ్ చాంబర్ సూచనలను పరిగణలోకి తీసుకొని తినుబండారాల ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన మల్టీఫ్లెక్స్ ప్రతినిధులు, నిర్మాతలు నిర్ణయించిన టికెట్ ధరలనే మల్టీఫ్లెక్స్ లో అమలు చేస్తామని కూడా తెలిపినట్టు సమాచారం. ఈ క్రమంలో ఈ నెల 10న మరోసారి సమావేశం కానున్న చాంబర్, మల్టీప్లెక్స్ జాతీయ ప్రతినిధులు ఈ విషయం మీద పూర్తి అవగాహనకు రానున్నారు.