»   »  నిర్మాతగా మారనున్న ఐటమ్ గర్ల్

నిర్మాతగా మారనున్న ఐటమ్ గర్ల్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mumaith Khan
"ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే" అంటూ తెలుగువారిని తన వైపుకు తిప్పుకున్నఐటమ్ గర్ల్ ముమైయిత్ ఖాన్ . ఐటమ్ సాంగ్స్ తో ఫుల్ బిజీగా ఉంటూనే అనుకోకుండా హీరోయిన్ గా మారింది. చాలా మందికన్నా బెటర్ అనిపించుకుంది. మినిమం ఓపినింగ్స్ రాబట్టగలుగుతోంది. అలా నిర్మాతలను సేఫ్ చేస్తూ కెరీర్ లో దూసుకు పోతున్న ముమైయిత్ ఖాన్ ఇప్పుడు నిర్మాతగా మరో అవతారం ఎత్తబోతోందిట. అన్ని అనుకూలిస్తే ఈ యేడాది ఆఖరికి నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తుందిట. తనకంటూ కొన్ని డ్రీమ్ రోల్స్ ఉన్నాయిని వాటికోసం చాలా మందిలా వేరే వాళ్ళపై రుద్దలేనని అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని సన్నిహితుల వద్ద చెప్పుకుందిట. "మరి అదే చేత్తో దర్శకత్వం కూడా చేసే ఆలోచన కూడా ఉందా?" అంటే అదేం లేదు అని తేల్చేసింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X