»   »  చరణ్ తేజ ....'కోడిపెట్ట' కనఫర్మ్ అయింది!!

చరణ్ తేజ ....'కోడిపెట్ట' కనఫర్మ్ అయింది!!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mumaith Khan
పాత హిట్ సాంగ్స్ ని రీమిక్స్ చేసి మళ్ళీ హిట్ కొట్టడంలో పేరున్నవాడు...పాపులర్ అయిన వాడు ఎస్.ఎస్.రాజమౌళి. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తేజ హీరోగా పునర్జన్మ కాన్సెప్ట్ తో ఓ సినిమాని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో రెండు ఐటం సాంగ్స్ ఉంటాయి. ముఖ్యంగా అప్పటి 'ఘరానా మొగడు' చిత్రంలో సూపర్ హిట్ సాంగ్ 'బంగారు కోడిపెట్ట....వచ్చెనండి...హె..పాప...' పాటని రీమిక్స్ చేసి ఈ సినిమాలో పెడుతున్నరాని అభిమానులు సంబరపడుతున్నారు. ఇంతకీ చరణ్ తేజ ప్రక్కన ఆడే ఆ కోడి పెట్ట ఎవరన్నది సస్పెన్స్ గా మిగిలింది.

ఇప్పుడది రివిల్ అయ్యింది. తెలుగు పరిశ్రమలో బంగారు కోడిపెట్టగా దూసుకుపోతున్న ముమైత్ ఆ పాటలో నర్తించనున్నదని తెలుస్తోంది. ఇప్పుడా పాటని అప్పటి లొకేషన్స్ (వైజాగ్) లో చిత్రీకరించనున్నారు. కీరవాణి సంగీత మందించే ఈ పాటకి ప్రేమరక్షిత్ కొరియోగ్రఫి అందిస్తున్నారు. యోదైమైనా చరణ్ అదృష్టవంతుడు తండ్రి నర్తించిన సాంగ్ లో తానూ నర్తించటం ఎంతమందికి లబ్యమవుతుంది అంటున్నారు ఈ న్యూ స్ తెలిసినవారు. మరో ప్రక్క హాట్ హాట్ ముమైత్ తో అదరకొట్టే స్టెప్ లతో రామ్ చరణ్ తేజ యే రేంజిలో అలరించనున్నాడో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X