twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలా కాలు జారి.. బతికేందుకు 20 శాతం మాత్రమే చాన్స్.. ముమైత్ ఖాన్ కంటతడి

    |

    డ్యాన్సర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో హీరోయిన్‌గా ఎదిగింది ముమైత్ ఖాన్. అలాంటి ముమైత్ ఖాన్ జీవితంలోనూ ఎన్నో కష్టాలున్నాయి. తాజాగా ఆమె అలీతో సరదాగా షోలో పాల్గొంది. అందులో ఆమె తన కష్టసుఖాలను, జీవితంలో ఎదుర్కొన్న బాధల గురించి చెప్పుకొచ్చింది. తాను కోమాలోకి వెళ్లిన రోజులు, ఆ సమయంలో ఎదుర్కొన్న సంగతుల గురించి చెప్పింది.

    అలా కాలు జారి..

    అలా కాలు జారి..

    కోమాలోకి ఎలా వెళ్లిందో ముమైత్ ఖాన్ వివరించింది. డిక్టేటర్ సినిమా సాంగ్ షూటింగ్ ముగిసింది. స్నానం చేసి వచ్చి, అద్దంలో చూసుకుంటుండగా 'మేరే ఖ్వబాన్' (దిల్‌వాలే దుల్హానియా జాయేంగే) పాట గుర్తొచ్చింది. అలా పరధ్యానంలో ఉండటంతో మార్బుల్‌ ఫ్లోర్‌పై జారిపడ్డాను. పక్కన ఉన్న మంచం కోణం నా తలకు తగిలి పెద్ద గాయమైంది. తర్వాత ఏమైందో కూడా నాకు తెలీదు లేచి చూస్తే ఆసుపత్రిలో ఉన్నాను. 15 రోజులు కోమాలో ఉన్నాననంటూ ముమైత్ ఖాన్ చెప్పుకొచ్చింది.

    20 శాతం మాత్రమే..

    20 శాతం మాత్రమే..

    తలకు సంబంధించిన ఐదు నరాలు డ్యామేజ్‌ అయ్యాయి. ఇలాంటి శస్త్ర చికిత్స పెద్ద వయసు వారికే ఎక్కువగా జరుగుతుంది. నాకు తెలిసి తక్కువ వయసులో ఈ ఆపరేషన్‌ జరిగిన వ్యక్తిని నేనే కావొచ్చు. ప్రస్తుతం నా బ్రెయిన్‌లో 9 టైటానియం తీగలున్నాయి. వైద్యులు నేను బతికేందుకు 20 శాతం మాత్రమే అవకాశం ఉందని చెప్పారంటూ నాటి భయంకరమైన రోజులను ముమైత్ ఖాన్ గుర్తుకు చేసుకుంది.

    నాకే ఎందుకిలా జరుగుతోంది?..

    నాకే ఎందుకిలా జరుగుతోంది?..

    అయితే మళ్లీ మూడేళ్లు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెబితే.. నేను మాత్రం మూడు నెలల్లోనే పనిలోకి వచ్చాను. ప్రమాదకరమైన స్టంట్స్‌ కూడా చేశాను. అక్కడి నుంచి ఆలోచించడం మొదలు పెట్టా. అసలు నేను పరిశ్రమకు ఎలా వచ్చాను? దేవుడు నాకు ఏం ఇచ్చాడు? జ్ఞానం, మంచి పేరు, డబ్బు.. అంతా బాగానే ఉన్నా నాకే ఎందుకిలా జరుగుతోంది?ఇలా ఒకటే ఆలోచనలంటూ ముమైత్ ఖాన్ తన బాధల గురించి చెప్పుకొచ్చింది.

    అదే అడుగుతా..

    అదే అడుగుతా..

    అల్లాని అడుగుతున్నా.. సమస్యలు ఇచ్చినా స్వీకరిస్తాను కానీ, దాన్ని దాటే మార్గం చూపించమని మాత్రం అడుగుతా. దాని కోసం కష్టపడతా. నేను ఎవరికీ హాని చేయలేదు. మోసం చేయలేదు. తప్పుచేయలేదు, అబద్ధం ఆడలేదు. నా జీవితానికెందుకు అప్పుడే ఫుల్‌స్టాప్‌ అంటూ ముమైత్ ఖాన్ తన బాధనంతా బయటపెట్టేసింది.

    English summary
    Mumaith Khan About Her Bad Days While In Coma,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X