»   » క్యాబరే డాన్సర్‌గా ముమైత్ ఖాన్ కేక

క్యాబరే డాన్సర్‌గా ముమైత్ ఖాన్ కేక

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముమైత్‌ ఖాన్ ప్రధానపాత్రలో రూపొందిన 'యల్ బోర్డ్' చిత్రం ఈ నెల 25వ తేదీన రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కథ ఒక క్యాబరే డాన్సర్‌కీ, మాఫియా గ్యాంగ్‌ లో పనిచేసే ఓ యువకుడికీ మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారితీసిందనేది పాయింటుతో రూపొందింది. ఇక ఈ చిత్రంలో క్యాబరే డాన్సర్‌గా ముమైత్ చేసిన నృత్యాలు అదరకొడ్తాయని నిర్మాతలు అంటున్నారు. అలాగే మాఫియా గ్యాంగ్ నుంచి తన ప్రియుణ్ణి బయటకు తీసుకురావడానికి ఆ గ్యాంగ్ లీడర్‌తో ఆమెకి ఎదురయ్యే సంఘటనలు ఆసక్తికరంగా ఉంటాయని నిర్మాతలు చేప్తున్నారు. ఇక ఈ చిత్రం హిందీలో 'లవ్ డాట్ కామ్' పేరుతో రిలీజ్ కానుంది. బప్పీలహిరి సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో నైనా దలైవాల్, జయ్ కల్రా, మైక్‌సింగ్ తారాగణం. అలాగే ఈ చిత్రానికి మాటలు, పాటలు: భారతీబాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వినోద్ ఎం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu