»   » 'యల్-బోర్డ్' పెట్టుకున్న ముమైత్ ఖాన్

'యల్-బోర్డ్' పెట్టుకున్న ముమైత్ ఖాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముమైత్ ఖాన్ త్వరలో తన అందచందాలకు 'యల్-బోర్డ్' బోర్డు పెట్టుకుని ధియోటర్లో దిగనుంది. ఆమె ప్రధాన పాత్రలో హిందీలో చేసిన 'లవ్ డాట్ కామ్' చిత్రం త్వరలో తెలుగులో 'యల్-బోర్డ్' పేరుతో డబ్బింగ్ అవుతోంది. ఈ చిత్రం కథ ఒక క్యాబరే డాన్సర్‌కీ, మాఫియా గ్యాంగ్‌లో పనిచేసే ఓ యువకుడికీ మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారితీసిందనేది చిత్ర కథాంశం గా రూపొందింది. ఇక ఈ చిత్రంలో క్యాబరే డాన్సర్‌గా ముమైత్ చేసింది. మాఫియా గ్యాంగ్ నుంచి తన ప్రియుణ్ణి బయటకు తీసుకురావడానికి ఆ గ్యాంగ్ లీడర్‌తో ఆమెకి ఎదురయ్యే సంఘటనలు ఆసక్తికరంగా ఉంటాయని నిర్మాతలు చేప్తున్నారు. ఈ చిత్రానికి బప్పీలహిరి సంగీతం సమకూర్చారు. తెలుగులో ఈ చిత్రాన్ని ఆర్.జె. ఫిలిమ్స్ పతాకంపై యువరాజ్ జె అందిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానున్నది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu