»   » ముమైత్ ఖాన్ 'యల్-బోర్డ్' ఎంతదాకా వచ్చింది?

ముమైత్ ఖాన్ 'యల్-బోర్డ్' ఎంతదాకా వచ్చింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముమైత్‌ ఖాన్ ప్రధాన పాత్రధారిగా తెలుగులో 'యల్-బోర్డ్' పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. హిందీలో తయారవుతున్న 'లవ్ డాట్ కామ్' కి తెలుగు రూపం ఇది. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత యువరాజ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఆయన మాట్లాడుతూ..."రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఇది రూపొందింది. ఒక క్యాబరే డాన్సర్‌కీ, మాఫియా గ్యాంగ్‌లో పనిచేసే ఓ యువకుడికీ మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారితీసిందనేది చిత్ర కథాంశం. క్యాబరే డాన్సర్‌గా ముమైత్ నటన, ఆమె అందచందాలు, ఆమె చేసే సాహసాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణ. మాఫియా గ్యాంగ్ నుంచి తన ప్రియుణ్ణి బయటకు తీసుకురావడానికి ఆ గ్యాంగ్ లీడర్‌తో ఆమెకి ఎదురయ్యే సంఘటనలు ఆసక్తికరంగా ఉంటాయి. బప్పీలహిరి సంగీతం సమకూర్చిన నాలుగు పాటలు ఎంతో మధురంగా ఉంటాయి. వాటిని అందమైన లొకేషన్లలో, భారీ సెట్స్‌లో చిత్రీకరించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం'' అని చెప్పారు. నైనా దలైవాల్, జయ్ కల్రా, మైక్‌సింగ్ తారాగణమైన ఈ చిత్రానికి మాటలు, పాటలు: భారతీబాబు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వినోద్ ఎం. తెలుగులో ఈ చిత్రాన్ని ఆర్.జె. ఫిలిమ్స్ పతాకంపై యువరాజ్ జె. అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ పనులు పూర్తి చేసుకుని, తొలికాపీతో విడుదలకు సిద్ధమయింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X