నటి, మోడల్ అంజుమ్ నాయర్ అరెస్టు

ఆదివారం రాత్రి ఆ సంఘటన జరిగింది. అంధేరిలోని మసర్త ఆంగన్ భవనంలోని 20వ అంతస్థులో అంజుమ్ నివసిస్తోంది. పెద్దగా మ్యూజిక్ పెట్టి వింటున్న ఆమెపై ఇరుగు పొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఇద్దరు పోలీసులు ఆమె ఇంటికి సోమవారం తెల్లవారు జామున 2 గంటలకు వచ్చారు.
వాల్యూమ్ తగ్గించాలని పోలీసులు ఆమెకు సూచించారు. దాంతో ఆమె పోలీసులను దుర్భాషలాడమే కాకుండా వారిని బెదిరించిందని కూడా అంటున్నారు. దాంతో పోలీసులు ఆమెను సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆమెకు జరిమానా కూడా విధించారు.


Click it and Unblock the Notifications











