ముని-3 : హీరోయిన్ తాప్సి తెగింపు
ఈ సినిమా కోసం తాప్సీ ఎలాంటి రిస్క్ సీన్లయినా చేయడానికి సై అంటోంది. భయం అనేదే లేకుండా తెగింపుగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం చెన్నైలో ఈమెపై కొన్ని యాక్షన్ సన్నివేశాలను తీస్తున్నారు. ఓ సీన్ కోసం 12గంటలు నీళ్ళలో గడిపింది. అంతసేపు నీళ్లలో గడపడం వల్ల అందం, ఆరోగ్యం పాడవుతుందని, డూప్‌తో ఆ సీన్ చేద్దామని....దర్శక నిర్మాతలు చెప్పినా తాప్సీ వినకపోగా తానే చేస్తానని పట్టుబట్టిందట.
ఈ సినిమా గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ, తన కెరీర్లో ఎన్నడూ చేయని దమ్మున్న పాత్ర చేస్తున్నానని, ప్రేక్షకులను మెప్పిస్తాననే నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది. మరి తాప్సీ కష్టానికి తగిన విధంగా ఈ సినిమా ఫలితం ఉండాలని ఆశిద్దాం.
రాఘవ లెరెన్స్, తాప్సీ జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి ఫోటోగ్రఫీ: కిచ్చా, సంగీతం: విజయ్ ఆంథోని, సమర్పణ: మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-కొరియోగ్రఫీ-దర్శకత్వం: రాఘవ లారెన్స్.


Click it and Unblock the Notifications












