twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సవాల్ విసురుతున్న రాంగోపాల్ వర్మ.. మిర్యాలగూడ గడ్డపై ప్రెస్ మీట్.. మరింత వివాదంగా ‘మర్డర్’!

    |

    మిర్యాలగూడలో జరిగిన ఓ పరువు హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ నిజ జీవిత కథను సినిమాగా తెరకెక్కించారనే ఊహాగానాలను రూమర్లను దర్శకుడు, నిర్మాత రాంగోపాల్ వర్మ ఖండిస్తూ వస్తున్నారు. మర్డర్ సినిమా రిలీజ్‌ను ఆపివేయాలని సదరు బాధితురాలు, మృతుడి కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించడం అప్పట్లో వివాదంగా మారింది. అయితే తాజాగా రాంగోపాల్ వర్మ విడుదల చేసిన వీడియో మరింత చర్చకు దారి తీసింది. ఆ వివరాల్లోకి వెళితే..

    అమృత, ప్రణయ్ ప్రేమ కథ

    అమృత, ప్రణయ్ ప్రేమ కథ

    దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రణయ్ హత్య, అమృత ప్రేమ కథ, మారుతీ రావు వ్యధ భరిత జీవితం ఆధారంగా మర్డర్ సినిమాను తెరకెక్కించలేదు. దేశవ్యాప్తంగా జరిగిన అలాంటి సంఘటనలను స్పూర్తిగా తీసుకొని మర్డర్ సినిమాను తెరకెక్కించాను. మర్డర్ సినిమా వల్ల అమృత జీవితంపై ఎలాంటి ప్రభావం పడదు. ఇప్పటికే ఆమె జీవితంలో చోటుచేసుకొన్న కొన్ని సంఘటనలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. అలాంటి సంఘటనలే రోజు పేపర్లో చూస్తున్నాం. ఇక ఈ విషయంలో కొత్తగా చెప్పాల్సి ఏముంది. ఈ విషయంలో వస్తున్న అపోహలు సరైనవి కావు అని అప్పట్లో ఆర్జీవి క్లారిటీ ఇచ్చారు.

    అన్ని అడ్డంకులు దాటుకొని

    అన్ని అడ్డంకులు దాటుకొని

    తాజాగా మర్డర్ మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ... సినిమా అన్ని అడ్డంకులు దాటుకొని రిలీజ్‌కు సిద్ధమైంది. మా సినిమాపై వేసిన కేసులు పరిష్కారమయ్యాయి. సెన్సార్ అధికారులు రిలీజ్ చేసుకోవచ్చని క్లియరెన్స్ ఇచ్చారు. ఈ సినిమా డిసెంబర్ 24వ తేదీన రిలీజ్ అవుతున్నది అని రాంగోపాల్ వర్మ తాజాగా వీడియోను రిలీజ్ చేసి వివరణ ఇచ్చారు.

    దేశవ్యాప్తంగా వాస్తవ సంఘటనలతో

    దేశవ్యాప్తంగా వాస్తవ సంఘటనలతో

    దేశవ్యాప్తంగా జరిగిన వాస్తవ సంఘటనలు, కొన్ని నిజ జీవిత సంఘటనలు మర్డర్ సినిమాకు ఇన్సిపిరేషన్ ఇచ్చాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్‌ను 22వ తేదిన మిర్యాలగూడలో నిర్వహిస్తున్నాం. మిర్యాలగూడలోనే ఎందుకు అంటే.. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిని చెప్పడానికి వీలు లేదు. కానీ మిర్యాలగూడలోనే ప్రెస్ మీట్ పెట్టడం ఈ సినిమాకు కరెక్ట్ అని భావిస్తున్నాం అని రాంగోపాల్ వర్మ వీడియోలో స్పష్టత ఇచ్చారు.

    ప్రేమ, పెళ్లి పేరుతో దారుణాలు

    ప్రేమ, పెళ్లి పేరుతో దారుణాలు

    మర్డర్ సినిమా 24వ తేదీన రిలీజ్ అవుతున్నది. థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. ఈ సినిమా చూసిన తర్వాత నిజ జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలు స్పష్టమవుతాయి. ప్రేమ, పెళ్లి పేరుతో హత్యకు గురికావడం, సూసైడ్ చేసుకోవడం, ఇంటి నుంచి పారిపోవడం లాంటి ఎన్నో విషయాలు మర్డర్ సినిమా ద్వారా తెలుస్తాయి.

    తల్లిదండ్రుల మధ్య నిరంతరంగా యుద్దం

    ప్రేమ పెళ్లిళ్ల విషయంలో తల్లిదండ్రులు, వారి పిల్లల మధ్య జరిగే నిరంతర యుద్ధాలు జరుగుతుంటాయి. తాము తీసుకొన్న నిర్ణయం కరెక్ట్ అని ఇరు వర్గాల మధ్య మానసిక సంఘర్షణ జరుగుతుంది. ఉద్వేగాలు, భావోద్వేగాలు బయటకు వస్తాయి. అలాంటివి కరెక్టా తప్పా అనేది మీరే చూసి తేల్చుకొండి అంటూ రాంగోపాల్ వర్మ తన వీడియోలో పేర్కొన్నారు.

    English summary
    RGV's Murder Movie set release on December 24th in Theatres. In this occassion, RGV released a video and says that He will be conducting a press meet on December 22nd at Miryalaguda. RGV's Murder Movie gets set back form Nalgonda SC, ST Court. This court has been directed Director Ram Gopal varma, Producer Natti Kumar for not to release movie, Until the Pranay Kumar case finished. Recently, Telangana Court has given signal to movie release. In this occassion, RGV spoke to media
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X