»   » మహేష్ తో సినిమాపై మురుగదాస్ ఇలా..

మహేష్ తో సినిమాపై మురుగదాస్ ఇలా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్, మురుగుదాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంభంధించిన కథ ఫైనలైజ్ చేసి, కాస్టింగ్ కూడా మొదలు పెట్టారు. ఈ సినిమాకు హీరోయిన్ గా శృతి హాసన్ ని ఫైనలైజ్ చేసారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించి బయిట మీడియాలో రకరకాల రూమర్స్ , వార్తలు వస్తున్నాయి. కథ గురించి హీరోయిన్ గురించి, బడ్జెట్ గురించి రోజుకో వార్త వస్తోంది.

ఈ నేపధ్యంలో మురుగుదాస్ వాటిని ఖండిస్తూ మీడియాకు క్లారిఫై చేసారు. బయట చాలా రూమర్స్ వినిపిస్తున్నాయని, దానికి కారణం తను చెప్పిన కథని తమిళ హీరో అజిత్ రిజక్ట్ చేసారని, ఇప్పుడు ఆ కథని తీసుకొచ్చి మహేష్ కు తగిలించారన్న దానిలో వాస్తవం లేదని తెలిపారు. హీరోను దృష్టిలో పెట్టుకునే కథను రెడీ చేసుకుంటాను, అంతేకానీ మరేవిదంగా ఆలోచించనని తెలిపారు.

Murugadoss clarified on Mahesh Movie

బహుశ ఈ సినిమాను ఉగాదికి లాంచ్ చేసే అవకాశం కనబడుతోంది. అలాగే...ఏప్రియల్ రెండవ వారం నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని సమచారం. ప్రస్తుతం మురుగదాస్ తన బాలీవుడ్ చిత్రం అకిరా తో బిజీగా ఉన్నారు.

మహేష్ కూడా బ్రహ్మోత్సవం షూటింగ్ లో బిజిగా గడుపుతున్నారు. ఈ సినిమాకు సంబందించిన టీజర్ కి మంచి స్పందన కూడా లభించింది. ఫ్యామిలి ఆడియన్స్ కోసమే అన్నట్టు ఈ సినిమా కనబడుతోంది.

English summary
Murugadoss clarified that he always write stories keeping in the image of a star and so one story penned for a hero will not suit for the other.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu