»   » మహేష్ బాబును డిఫరెంట్ అవతార్ లో చూస్తారు: మురుగదాస్ ఇంటర్వ్యూ

మహేష్ బాబును డిఫరెంట్ అవతార్ లో చూస్తారు: మురుగదాస్ ఇంటర్వ్యూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆర్. మురుగదాస్... ఇండియన్ సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. ఆయన సినిమాలు ప్రత్యేకంగా ఉండటంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటాయి కాబట్టే ఆయన ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యారు. తన సక్సెస్ వెనక సీక్రెట్ ఏమీ లేదని... ప్రేక్షకుల వ్యూ పాయింటులో తాను సినిమాలు తీస్తాను, అంతకు మించి మరేమీ లేదని అన్నారు.

తాజాగా ఆయన న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. త్వరలో తాను మహేష్ బాబుతో చేయబోతున్న భారీ ప్రాజెక్టు గురించి కూడా మాట్లాడారు. ఆయన ఏం చెప్పారనే విషయాలపై ఓ లుక్కేద్దాం.

నేనెప్పుడూ ఓ డైరెక్టర్ దృష్టితో సినిమాలు చేయను. నేను ఏదైనా కథను సినిమాగా చేయాలనుకున్నపుడు ముందుగా ప్రేక్షకుల కోణంలో ఆలోచిస్తాను. నా సక్సెస్ వెనక ఏదో రహస్య ఫార్ములా ఉందని అంతా అనుకుంటారు. కానీ అది చాలా సింపుల్. అందరూ మెచ్చే కథలను, కాన్సెప్టులను ఎంచుకోవడమే నా విజయ రహస్యం అన్నారు.

బాలీవుడ్ గురించి

బాలీవుడ్ గురించి

నేను సౌత్ లో పని చేసినా, బాలీవుడ్లో పని చేసినా ఒకేలా ఉంటుంది. డిఫరెంట్ అప్రోజ్ అంటూ ఏమీ ఉండదు. రూరల్ సబ్జెక్టు మీద పని చేసినప్పుడే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేదాని గురించి కాస్త వర్రీ ఉంటుంది. సీటీ బేస్డ్ స్క్రిప్టు విషయంలో రెస్పాన్స్ కాస్త అటూ ఇటుగా ఉన్నా వర్కౌట్ అవుతుంది అన్నారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో

ప్రస్తుతం మహేష్ బాబుతో భారీ బడ్జెట్ ద్వీబాషా మూవీ సినిమా చేస్తున్నారు మురుగదాస్. దీనిపై ఆయన మాట్లాడుతూ...తెలుగు, తమిళం ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుంది. రెండు బాషల్లో వేర్వేరేగా చిత్రీకరణ చేస్తున్నాం. ఇందుకోసం ప్రతి సీన్ రెండు సార్లు చేయాల్సి వస్తోంది అన్నారు. రెండు బాషల్లోనూ ఆర్టిస్టులు కాస్త వేరుగా ఉంటారు. వారంతా కూడా తమ సొంత వాయిస్ తో డబ్బింగ్ చెప్పుకుంటారు. మహేష్ బాబు తమిళంలో కూడా తన సొంత వాయిస్ తో డబ్బింగ్ చెబుతారు అన్నారు.

చిరంజీవి తర్వాత ఇపుడు మహేష్ బాబు

చిరంజీవి తర్వాత ఇపుడు మహేష్ బాబు

మురుగదాస్ గతంలో ఒకే ఒక తెలుగు సినిమా చేసారు. అది కూడా మెగాస్టార్ చిరంజీవితో చేసిన స్టాలిన్ సినిమా. మళ్లీ 9 ఏళ్ల తర్వాత తెలుగులో సినిమా చేస్తున్నాను. భవిష్యత్తులో మరిన్ని ద్విబాషా చిత్రాలు ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో కొన్ని చిత్రాలు నిర్మించాలనే ఆలోచన కూడా ఉంది అన్నారు మురుగదాస్.

మహేష్ బాబు కెరీర్లోనే భారీ ఖర్చుతో తీస్తున్న మూవీ

మహేష్ బాబు కెరీర్లోనే భారీ ఖర్చుతో తీస్తున్న మూవీ

ఇది మెస్ట్ ఎక్స్ పెన్సివ్ చిత్రం అని ఇప్పుడు చెప్పడం చాలా కష్టం. ఇటీవల మేము షూటింగ్ ప్రారంభించాం. ఇటీవల నేను హిందీలో తీసిన అకీరా చిత్రం చాలా తక్కువ బడ్జెట్ లో తీసిన సినిమా అని చెప్పగలను. స్క్కిప్టును బట్టే సినిమా బడ్జెట్ ఉంటుంది. ఒక ఫిల్మ్ మేకర్ గా మంచి సినిమాలు చేయాలని మాత్రమే ఆలోచిస్తాను, బడ్జెట్ గురించి కాదు అన్నారు మురుగదాస్.

మహేష్ తో కలిసి పని చేయడంపై మురుగదాస్ స్పందిస్తూ...

మహేష్ తో కలిసి పని చేయడంపై మురుగదాస్ స్పందిస్తూ...

చాలా కాలంగా మహేష్ బాబుతో సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ చాలా బావుంటుంది. అందుకే ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో మహేష్ బాబును ఒక డిఫరెంట్ అవతారంలో ప్రేక్షకులు చూడబోతున్నారు అని మురుగదాస్ తెలిపారు.

English summary
"I'm glad Mahesh and I are finally working together. I've always admired him and have been in awe of his screen presence. Audiences will see him a very different avatar this time," Murugadoss said. Also starring Rakul Preet Singh and S.J. Suryah, the film is being bankrolled by Tagore Madhu and N.V. Prasad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu