twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాక్ న్యూస్ : రిలీజ్ అగిపోయిన 'తుపాకి'

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఫైనాన్సియల్ కారణాలతో మరో చిత్రం ఆగిపోయింది. నాగార్జున ఢమురకం చిత్రం రూట్ లోనే మరో పెద్ద చిత్రం ప్రయాణిస్తోంది. ఇళయదళపతి విజయ్, దర్శకుడు ఏఆర్.మురుగదాస్ కాంబినేషనల్ రూపొందిన మోస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్ చిత్రం తుపాకీ. దీపావళి కానుకగా ఈ చిత్రం ఈ రోజు(మంగళవారం)విడుదల కావాలి. కానీ చాలా రిలీజ్ కాలేదు. చాలా ధియోటర్స్ వద్ద బాక్స్ లు రాకపోవటంతో సినిమా రిలీజ్ కాలేదు అని బోర్డ్ పెట్టారు. దాంతో దీపావళికి పెద్ద సినిమా ఏదీ రిలీజ్ కాకుండా పోయింది. ఈ చిత్రానికి ఫైనాన్స్ క్లియరెన్స్ లు కాకపోవటంతో రిలీజ్ కాలేదు అని ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. అయితే ఈ రోజు రాత్రికి రిలీజయ్యే అవకాసం ఉందని కొన్ని వర్గాలు అంటున్నాయి.

    గతంలో గజనీ,సెవెంత్ సెన్స్ వంటి చిత్రాలతో తెలుగు వారిని సైతం ఆకట్టుకున్న మురగదాస్ దర్శకుడు కావటంతో ఈ డబ్బింగ్ చిత్రానికి సైతం తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడుతుందని నిర్మాతలు భావించారు. అయితే ప్రస్తుతం డబ్బింగ్ చిత్రాలకు తెలుగునాట ఆదరణ కనపడటం లేదు. ముఖ్యంగా విజయ్ చిత్రాలకు ఇక్కడ మార్కెట్ లేకపోవటంతో బిజినెస్ కాలేదని సమాచారం. దాంతో చిత్రం విడుదల కాలేదని బాక్స్ లు ల్యాబ్ లోనే ఉన్నాయని చెప్తున్నారు.

    కథ గా చెప్పాలంటే...జగదీష్‌ (విజయ్‌) ముంబైలోనే పుట్టి పెరుగుతాడు. అతని తండ్రి ఆర్మీ అధికారి. జీవితాన్ని ఎప్పుడూ సరదాగా గడపాలనుకొంటాడు జగదీష్‌. ముఖ్యమైన వ్యవహారం నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఏం జరిగింది? ముంబైకి తిరిగొచ్చిన జగదీష్‌కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అతని జీవితంలోకి నిషా (కాజల్‌) అనే యువతి ఎలా ప్రవేశించింది? తదితర విషయాల్ని తెరపైనే చూడాలి.

    దర్శకుడు మురగదాస్ మాట్లాడుతూ.... తుపాకీ విషయంలో నేను తొలి నుంచి చెబుతున్న మాట ఒక్కటే. పూర్తిగా కమర్షియల్ ఫార్మెట్‌లో రూపొం దిన మాస్ సూపర్‌స్టార్ రజనీకాంత్ 80, 90లో నటించిన చిత్రాల తరహాలో తుపాకీ చిత్రాన్ని తెరకెక్కించాలని భావించాను. ఈ చిత్రాన్ని స్నేహితులు, కుటుంబం, పిల్ల లు సహా కలిసి మళ్లీ మళ్లీ చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఏ తరగతికి చెందిన వారు బోర్ ఫీల్‌కారు అన్నారు.

    English summary
    
 Tamil hero Vijay's dubbed movie 'Tupaki' is expected to hit theatres. Latest information is that 'Tupaki' is not hitting theatres today due to some financial issues and there are some chances for the movie to hit screens only by evening. That will not bring good openings, as Deepavali is celebrated in the evening only.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X