»   » దత్తత నిర్ణయం: మహేష్ బాబుకు కొత్త తలనొప్పులు!

దత్తత నిర్ణయం: మహేష్ బాబుకు కొత్త తలనొప్పులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు' మూవీ బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించడంతో పాటు.... ఊరికి ఏదైనా మంచి చేయాలనే కాన్సెప్టు ఎంతో మందిలో మార్పు తెచ్చింది. సినిమా చూసిన తర్వాత పలువురు తమ ఊరికి ఏదైనా మంచి చేయాలని ముందుకొచ్చారు. ఈ మధ్య కాలంలో జనాల్లో ఒక మంచి ఆలోచనకు బీజం వేయడంతో పాటు ఆచరణలో పెట్టేలా ప్రభావం చూపిన సినిమా ‘శ్రీమంతుడు' మాత్రమే.

కేవలం సినిమాలో అలాంటి కాన్సెప్టు చూపడమే కాదు....మహేష్ బాబు ఇటీవలే తన తండ్రి కృష్ణ పుట్టిన ఊరైన బుర్రిపాలెంను దత్తత తీసుకున్నారు. దీంతో పాటు తెలంగాణలో కూడా మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని చింతలకుంట గ్రామాన్ని కూడా దత్తత తీసుకునేందుకు సిద్ధమయ్యారు.


Musalimadugu Villagers requests Mahesh Babu

అయితే తాజాగా మహేష్ బాబుకు కొత్త తలనొప్పితయారైంది. ఖమ్మం జిల్లాలోని ముసలిమడుగు గ్రామానికి చెందిన వారు మహేష్ బాబు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఈ గ్రామానికి, మహేష్ బాబుకు సంబంధం ఉంది కాబట్టే వారు మహేష్ బాబును సహాయం కోరుతున్నారు.


మహేష్ బాబు తల్లి ఇంద్రాదేవి పుట్టింది ఈ ఊరిలోనే. ఆమె నవసించిన ఇల్లు కూడా ఇక్కడ ఉంది. ప్రస్తుతం ఆ ఇల్లు శిథిలావస్థలో ఉంది. ఆమె కుటుంబం ఇక్కడ నివసించినపుడు పేదవారికి సహాయం చేసే వారట. ప్రస్తుతం ఆ ఊరు సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతోంది. తమ గ్రామానికి మంచినీరు, పాఠశాలలు కట్టించమని ఇటీవలే మహేష్ బాబు ఫ్యామిలీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మరి ముసలిమడుగు గ్రామస్థుల విజ్ఞప్తిపై మహేష్ బాబు ఎలా స్పందిస్తారో చూడాలి!

English summary
Musalimadugu Villagers requests Mahesh babu to adopt their village.
Please Wait while comments are loading...