»   » పవన్‌పై కొండంత అభిమానం.. ఆల్బమ్ రూపంలో..

పవన్‌పై కొండంత అభిమానం.. ఆల్బమ్ రూపంలో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

అభిమాన నటుల కోసం ఫ్యాన్స్ చేసే పనులు, విన్యాసాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. పవర్ స్టార్‌ క్రేజ్‌ను గ్రహించిన గీత రచయిత రామారావు ఓ ఆడియో ఆల్బమ్‌ను రూపొందించారు. దానిలో విశేషమేమింటంటే.. పవన్ నటించిన 22 సినిమాలను ఆధారంగా చేసుకొన్ని ఈ ప్రయత్నం చేశాను అని రామరావు చెప్పారు.

రాజ్‌కిరణ్ సంగీత దర్శకత్వంలో ఎస్ఎన్ఆర్ట్ క్రియేషన్స్ పర్యవేక్షణలో ఈ ఆల్బమ్‌ రూపొందింది. ఈ ఆల్బమ్‌ను లైక్ అండ్ షేర్ స్టూడియోలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆవిష్కరించారు. ఆల్బమ్‌ను ఆవిష్కరణ అనంతరం రామకృష్ణ గౌడ్ ఆర్కే మీడియాతో మాట్లాడుతూ.. రామారావు రాసిన సాహిత్యం అద్భుతంగా ఉంది. రాజ్‌కిరణ్ ఇచ్చిన ట్యూన్స్ సూపర్‌గా ఉన్నాయి అన్నారు.

Music Album on Pawan Kalyan by lyricist Ramarao

పవన్ కల్యాణ్ అభిమానిగా ఈ ఆల్బమ్ రూపొందించాను. ఈ ఆల్బమ్ అందరికీ నచ్చుతుంది అని రాజ్‌కిరణ్ అన్నారు. ఈ కార్యక్రమానికి పవన్ అభిమానులు, రాజ్‌కిరణ్ సన్నిహితులు హాజరయ్యారు. రామారావు చేసిన ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకున్నారు.

English summary
Lyricist Ramarao brought a music album on Pawan Kalyan. Tunes given by music director Rajkiran. This Audio released by Telangana Film Chamber chairman Pratani Ramakrishna Goud in hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu