»   »  టాలీవుడ్‌లో మరో విషాదం: అనూప్ రూబెన్స్‌కు మాతృవియోగం

టాలీవుడ్‌లో మరో విషాదం: అనూప్ రూబెన్స్‌కు మాతృవియోగం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శుకుల్లో ఒక్కరైన అనూప్ రూబెన్స్ ఇంట విషాదం నెలకొంది. దేవిశ్రీ ప్రసాద్ తండ్రి చనిపోయారనే వార్తను మరచిపోక ముందే మరో దుర్వార్త తెలుగు సినీ అభిమానులను విషాద సాగరంలో ముంచెత్తింది.

Music director Anoop Rubens mother dies

సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తల్లి మనోహరమ్మ(65) బాత్ రూమ్‌లో కాలు జారిపడగా ఆ షాక్ తో ఆమెకు గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో వెంటనే యశోదా ఆస్పత్రికి తరలించారు. అయితే డాక్టర్లు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో మనోహరమ్మ శుక్రవారం స్వర్గస్తులైనారు.

అనూప్ తల్లి మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు అనూప్‌ని ఓదార్చడమే కాక ఆమెకు తమ సంతాపాన్ని తెలియజేశారు. అనూప్ ప్రస్తుతం సోగ్గాడే చిన్ని నాయన, సౌఖ్యం చిత్రాలతో బిజీగా ఉన్నారు. సౌఖ్యం సినిమా ఈ నెల 24న విడుదల కానుంది.

English summary
Tollywood music director Anoop Rubens mother passed away.
Please Wait while comments are loading...