»   » సంగీత దర్శకుడు జీబ్రాన్ లోపల ఇంత వేదన ఉందా? కుటుంబమతా ఒకేసారి ఆత్మహత్య కోసం......

సంగీత దర్శకుడు జీబ్రాన్ లోపల ఇంత వేదన ఉందా? కుటుంబమతా ఒకేసారి ఆత్మహత్య కోసం......

Posted By:
Subscribe to Filmibeat Telugu

జిబ్రాన్ మంచి సంగీత దర్శకుడు, రన్ రాజా రన్, బాబు బంగారం సినిమాల తో ఆకట్టుకున్నాడు. చాలా తమిళ్ సినిమాలకు సంగీతం అందించిన జిబ్రాన్ నేషనల్ అవార్డు విన్నర్ అన్నసంగతి తెసిసిందే. అటు తమిళంలో, ఇటు తెలుగులో టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. కమల్ హాసన్ లాంటి లెజెండ్ ఇతడి మ్యూజిక్ విని మెస్మరైజ్ అయిపోయి.. ఒకటి రెండు కాదు వరుసగా నాలుగుసినిమాల్లో అతడికి అవకాశం ఇచ్చాడంటేనే అతడి ప్రతిభేంటో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న జిబ్రాన్.. ఒక దశలో ఆత్మహత్య చేస్కుందామనుకున్నాడట... తనొక్కడు కాదు మొత్తం కుతుంబం కుతుంబమే ఆత్మ హత్య చేస్కుందాం అమ్నుకున్నారట. ఈ విషయలన్నీ ఈ మధ్యనే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన గతం గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఒకప్పుడు అతడి కుటుంబంలో అప్పుల్లో కూరుకుపోయిందట. ఓ దశలో ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ కలిసి ఆత్మహత్య కూడా చేసుకుందామనుకున్నారట. ఈ విషయం అతని మాటల్లోనే....

''నా చిన్నపుడు మా కుటుంబం మంచి స్థితిలో ఉండేది. కానీ ఒక టైంలో మా నాన్న నడిపే హోటల్ విపరీతమైన నష్టాల్లోకి వెళ్లింది. క్రమంగా వ్యాపారం కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి. నాన్న మానసికంగా చాలా కుంగిపోయారు. ఓ దశలో కుటుంబమంతా కలిసి ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాం. ఐతే చివరికి అది తప్పని నిర్ణయించుకుని జీవితంతో పోరాడదామని నిర్ణయించుకున్నాం.

Music Director Gibran Life Is Inspiring

ఇల్లు, సామాన్లు సహా అన్నీ అమ్మేసి అప్పుల వాళ్లకు డబ్బులిచ్చాం. బాగా బతికిన ప్రాంతంలోనే చితికిపోయి రోజులు గడపడం కష్టంగా మారింది. కట్టుబట్టలతో మా ఊరు వదిలి చెన్నైకి వలస వచ్చాం. అప్పటికి చేతిలో చిల్లిగవ్వ లేదు. నా చదువు పదో తరగతితో ఆగిపోయింది.

చెన్నైలో మా అన్నయ్య మెడికల్ షాపులో పనికి కుదిరితే.. నేను ఓ ఏజెన్సీలో మెడికల్ రెప్రజెంటేటివ్‌గా చేరాను. ఆ తర్వాత నేను లాటరీ షాపులోనూ పని చేశాను. అలా పని చేస్తూనే కీబోర్డు నేర్చుకున్నా. ట్రినిటీ కాలేజ్లో కోర్సు కూడా చేశా. మ్యూజిక్ క్లాసులు చెబుతూ డబ్బులు సంపాదించి.. ఆ తర్వాత సంగీతంలో మరింత ప్రావీణ్యం సాధించాను. ప్రకటనలతో నా ప్రస్థానం మొదలై.. సంగీత దర్శకుడిగా నిలదొక్కున్నాను'' అని జిబ్రాన్ చెప్పాడు.

English summary
"my family Disided to suiside that day" said Music Director Mohammad Gibran
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu