twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇళయరాజా ఆశీస్సులు తీసుకున్న అనుష్క (ఫొటోలు)

    By Srikanya
    |

    చెన్నై:అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'రుద్రమదేవి'. రానా ముఖ్య పాత్రధారి. గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ నేపధ్యంలో రీసెంట్ గా చెన్నై వెళ్లిన అనుష్క...ఆయన్ని కలిసి మాట్లాడి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఆ సమయంలో తీసన ఫొటోలనే మీరు ఇక్కడ చూడబోయేది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
    ఇక దేశంలో తొలిసారిగా స్టీరియోస్కోపిక్‌ త్రీడీ విధానంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రియల్ 24న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్స్ కు చెప్పినట్లు తెలుస్తోంది. తెలుగు,తమిళ,మళయాళ వెర్షన్ లు సైతం ఇదే రోజున విడుదల చేస్తారు.

    దాదాపు 45 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో తనకే సాధ్యమైన రీతిలో ఎవరూ వంక పెట్టలేని విధంగా రూపొందించాలని గుణ శేఖర్ కష్టపడుతున్నారు. బిజినెస్ కూడా అదే రేంజిలో జరుగుతుందని భావిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఎంట్రీ కలవటం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.

    అద్బుత ప్రయాణం

    అద్బుత ప్రయాణం

    రాణీ రుద్రమది ఓ అద్భుతమైన ప్రయాణం. ప్రపంచ చరిత్రలో ఆమె స్థానం పదిలం. ఈ తరానికి ఆమె కథ తెలియాలి.

    వక్రీకరించకుండా

    వక్రీకరించకుండా

    సాధ్యమైనంత వరకూ చరిత్రను వక్రీకరించకుండా ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

    ఉన్నతంగా

    ఉన్నతంగా


    సాంకేతికంగా ఈ సినిమాని అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు.

    కెరీర్ లోనే బెస్ట్

    కెరీర్ లోనే బెస్ట్

    అనుష్క కెరీర్‌లో అత్యుత్తమ చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది .

    ఆమెకు ఆమే సాటి

    ఆమెకు ఆమే సాటి

    రాణీ రుద్రమ కదనరంగంలోనే కాకుండా కళా రంగంలోనే గొప్ప కళాకారిణి అని, కత్తిపట్టినా, కాళ్ళకు గజ్జె కట్టినా ఆమెకు సాటి ఆమేనని ఈ చిత్రంలో దర్శకుడు తెలియజేయనున్నాడు.

     అలాంటిదే

    అలాంటిదే

    అమ్మాయిలంటే అందాల రాశులే కాదు, వీరనారీలు కూడా. ప్రేమ, కరుణ విషయంలో సున్నితమనస్కులే. కానీ శత్రు సంహారం చేయాల్సినప్పుడు అపరకాళీ అవతారం ఎత్తుతారు. రుద్రమదేవి కథ కూడా అలాంటిదే.

    సాహసాలకు తెర రూపం

    సాహసాలకు తెర రూపం

    రుద్రమదేవి తెగువ, ధైర్యం స్త్రీ జాతికే గర్వకారణం. ఆమె సాహసాలకు మేం తెర రూపం ఇస్తున్నాం అంటున్నారు గుణశేఖర్‌.

    రాజీ పడకుండా

    రాజీ పడకుండా

    భారత చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ‘రుద్రమదేవి' చిత్రాన్ని రూపొందించాలన్న పట్టుదలతో ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఇంటర్నేషనల్ స్టాండర్స్‌తో తీస్తున్నారు.

    గర్వించే

    గర్వించే

    తెలుగుజాతి గర్వించే కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టే సినిమా ఇది. దేశ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో ‘రుద్రమదేవి'ని తెరకెక్కించాలన్నదే ఈ సిని దర్శక,నిర్మాతల లక్ష్యం.

    ఎవరెవరు..

    ఎవరెవరు..

    ఈ చిత్రంలో రాణీ రుద్రమగా....అనుష్క, చాళుక్య వీరభద్రునిగా.... రానా, గణపతిదేవునిగా.... కృష్ణంరాజు, శివదేవయ్యగా... ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా.... సుమన్, మురారిదేవునిగా... ఆదిత్యమీనన్, నాగదేవునిగా.... బాబా సెహగల్,

    ఇంకా ...

    ఇంకా ...

    కన్నాంబికగా.... నటాలియాకౌర్, ముమ్మడమ్మగా.... ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా.... హంసానందిని, అంబదేవునిగా.... జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా.... అదితి చంగప్ప, కోటారెడ్డిగా.... ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా..... వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా .....అజయ్ కనిపించనున్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ...

    దర్శకుడు మాట్లాడుతూ...

    ''కాకతీయుల కాలం నాటి వైభవాన్ని కళ్లకు కట్టేలా ఈ సెట్‌లు ఉండబోతున్నాయి. వీటి కోసం తోట తరణి 400 స్కెచ్‌లు వేశారు. నాటి సంప్రదాయలు, జీవన స్థితిగతులను ప్రతిబింబించేలా చిత్రబృందం ఎంతో శ్రమించి వీటికి రూపు తీసుకొస్తోంది. '' అన్నారు.

    బందిపోటుగా...

    బందిపోటుగా...

    బందిపోటు పాత్రలో అల్లు అర్జున్‌ కనిపించనున్నారు. ఈ లుక్‌ని, మేకింగ్‌ వీడియో విడుదల చేసారు..అందరినుంచి మంచి ప్రసంసలు వచ్చాయి.

    రాబిన్ హుడ్

    రాబిన్ హుడ్

    ఈ గోన గన్నారెడ్డి పాత్ర ‘రాబిన్‌ హుడ్‌' తరహాలో యువతరాన్ని, పిల్లల్ని విశేషంగా ఆకట్టుకునే రీతిలో సాగుతుంది.

    హైలెట్

    హైలెట్

    పోరుగడ్డకి తిరుగుబాబు నేర్పిన కాకతీయ వీరఖడ్గం గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్‌ నటన చిత్రానికే హైలైట్‌గా నిలుస్తుంది. పీటర్‌ హెయిన్స్‌ ఆధ్వర్యంలో చిత్రీకరించిన పోరాట సన్నివేశాలు ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి.

    రెండు గెటప్స్..

    రెండు గెటప్స్..

    ఇందులో అనుష్క రెండు విభిన్నమైన గెటప్‌లో కనిపించబోతోంది. ఒకటి వీరనారిగా అయితే రెండోది గ్లామరస్‌ ప్రిన్సెస్‌. ఈ రెండు గెటప్‌ల కోసం కేవలం మూడు నెలల వ్యవధిలో తన బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకుంది.

    ఎవరెవరు

    ఎవరెవరు

    ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.

    ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

    English summary
    Rudhramadevi heroine actress Anushka has met Maestro Ilaiyaraaja at his recording studio on Sunday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X