»   » టీవీ నటితో తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ నిశ్చితార్థం (ఫోటోలు)

టీవీ నటితో తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ నిశ్చితార్థం (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య సినిమారంగంలో పని చేసే వారు....అదే రంగానికి చెందిన వారితో ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. సినిమా సింగర్లు శ్రావణ భార్గవి-హేమ చంద్ర, టీవీ యాంకర్ మృదుల-సింగర్ కృష్ణ చైతన్య ప్రేమ వివాహాలు చేసుకున్నారు. ఇటీవల నటుడు నందు-సింగర్ గీతా మాధురి ప్రేమ పెళ్లితో ఏకమయ్యారు. తాజాగా ఇదే బాటలో మరో సినీ జంట కూడా నడవబోతోంది.

ఇటీవల శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన 'మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో' చిత్రానికి సంగీతం అందించిన యువ సంగీత దర్శకుడు రఘురామ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. టీవీ నటి హరితేజతో రఘురామ్ నిశ్చితార్థం ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జరుగబోతోంది. వీరి మధ్య గత కొంతకాలంగా ప్రేమాయణం సాగుతోంది.

సంగీత దర్శకడు రఘురామ్, టీవీ నటి హరితేజకు సంబంధించిన మరిన్ని వివరాలు, ఫోటోలు స్లైడ్ షోలో.....

ప్రేమాయణం

ప్రేమాయణం


గత కొంతకాలంగా సంగీత దర్శకుడు రఘురామ్, టీవీ నటి హరితేజ మధ్య ప్రేమాయణం సాగుతోంది. ఇరుకుటుంబాల అంగీకారంతో వీరు వివాహం చేసుకోబోతున్నారు.

గాయకుడిగా రఘురామ్

గాయకుడిగా రఘురామ్


సై సింగర్స్ చాలెంజ్, వాయిస్ ఆఫ్ యూత్, స్టార్ ఆఫ్ ఏపి, ఆంధ్రా ఐడల్ వంటి ప్రముఖ రియాలిటీ షోలలో ఫైనలిస్టుగా నిలిచిన రఘురామ్ ‘గీతం, కలర్స్ ఆప్ లవ్' మ్యూజిక్ ఆల్బమ్స్ చేసాడు. గాయకుడిగా దాదాపు 40 చిత్రాలకు పాటలు పాడాడు.

సంగీత దర్శకుడిగా..

సంగీత దర్శకుడిగా..


గాయకుడి నుండి సంగీత దర్శకుడిగా మారిన రఘురామ్ పలు చిన్న చిత్రాలకు సంగీతం అందించారు. అయితే ఇటీవల శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు.

సంగీత దర్శకుడిగా..

సంగీత దర్శకుడిగా..


గాయకుడి నుండి సంగీత దర్శకుడిగా మారిన రఘురామ్ పలు చిన్న చిత్రాలకు సంగీతం అందించారు. అయితే ఇటీవల శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు.

సినిమాల్లో నటి హరితేజ

సినిమాల్లో నటి హరితేజ


కూచిపూడి డాన్సర్ అయిన హరితేజ దమ్ము, అత్తారింటికి దారేది, 1 నేనొక్కడినే వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu