»   »  సంగీత దర్శకుడు రవీంద్ర జైన్ కన్నుమూత

సంగీత దర్శకుడు రవీంద్ర జైన్ కన్నుమూత

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: మధుర సంగీత దర్శకుడు రవీంద్ర జైన్ ఇక లేరు. ఆయన వయస్సు 71 ఏళ్లు. గీత్ గాతా చల్, చిత్‌సోర్ వంటి సినిమాలకు ఆయన సంగీతాన్ని అందించి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. కిడ్నీల సమస్యతో ఆయన ఇటీవల ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు.

మైరుగైన చికిత్స కోసం జైన్‌ను చార్టర్డ్ ఎయిర్ అంబులెన్స్‌లో నాగపూర్‌లోని వోఖార్డ్ ఆస్పత్రి నుంచి ఈ నెల 7వ తేదీన బాంద్రాలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్ మీద ఉంచి ఆయనకు 24 గంటల పాటు డయాలసిస్ చేశారు.

Music director Ravindra Jain passes away

ఆదివారంనాడు సంగీత కచేరి చేయడానికి నాగపూర్ వెళ్లిన ఆయన అస్వస్థతకు గురయ్యారు. జైన్ మరణించే సమయంలో భార్య దివ్య, సోదరుడు మణీంద్ర ఆయన పక్కనే ఉన్నారు. చోర్ మచాయే షోర్, అంఖీయోంకే ఝరోఖన్ సే వంటి చిత్రాలకు కూడా ఆయన సంగీతాన్ని సమకూర్చారు.

రామ్ తేరీ గంగా మైలీ, దో జాసూస్, హీనా వంటి చిత్రాల ద్వారా రవీంద్ర జైన్‌కు రాజకపూర్ బ్రేక్ ఇచ్చారు 1980, 1990 మధ్య కాలంలో ఆయన పలు పౌరాణిక చిత్రాలకు, టెలివిజన్ సీరియళ్లకు సంగీతం అందించారు. షాహీద్ కపూర్, అమృతారావు నటించిన రాజశ్రీ ఫ్రొడక్షన్ పతాక కింద నిర్మించిన వివాహ్ సినిమాకు ఆయన ఇటీవల సంగీతాన్ని అందించారు.

English summary
Veteran music director and lyricist Ravindra Jain, who was undergoing treatment at Lilavati Hospital in Mumbai, passed away today.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu