»   » విజయశాంతి నోర్మూసుకో.. మ్యూజిక్ డైరెక్టర్ వార్నింగ్

విజయశాంతి నోర్మూసుకో.. మ్యూజిక్ డైరెక్టర్ వార్నింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళనాడులో లేడీ అమితాబ్‌కు షాక్ తగిలింది. తాజా రాజకీయ సంక్షోభంలో తలదూర్చిన రాములమ్మకు తల బొప్పికట్టింది. తమిళ రాజకీయాల్లో అధిపత్య పోరు కొనసాగుతున్న తరుణంలో శశికళకు విజయశాంతి మద్దతు పలుకడంపై అనేక విమర్శలు వెల్లువెత్తున్నాయి. తమిళ రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని తాజాగా విజయశాంతికి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ వసంతన్ హెచ్చిరించారు.

అప్పట్లో జయలలితతో సన్నిహితంగా..

అప్పట్లో జయలలితతో సన్నిహితంగా..

అన్నాడీఎంకే అధినేత్రి జే జయలలిత బతికి ఉన్న సమయంలో విజయశాంతికి ఆమెతో సన్నిహిత సంబంధాలుననాయి. జయ మరణాంతరం తమిళ రాజకీయాల్లో వేగంగా మార్పులు సంభవించాయి. ఊహించని మార్పులు చోటుచేసుకొన్నాయి.

సంక్షోభంలో చిన్నమ్మ శశికళకు మద్దతు

సంక్షోభంలో చిన్నమ్మ శశికళకు మద్దతు

తమిళనాడు రాజకీయాలు అత్యంత వివాదాస్పదమైన సమయంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు విజయశాంతి మద్దతు తెలిపారు. చిన్నమ్మకు అండగా ఉండటం తన కర్తవ్యం అని పేర్కొన్నారు. 122 ఎమ్మెల్యేల మద్దతు ఉన్న ఆమె సీఎం పదవికి అర్హులని పేర్కొన్నారు.

పన్నీరు సెల్వం రాష్ట్రానికి పట్టిన దుష్టశక్తి

పన్నీరు సెల్వం రాష్ట్రానికి పట్టిన దుష్టశక్తి

అన్నాడీఎంకే తిరుగుబాటు కూటమికి నాయకత్వం వహిస్తున్న పన్నీర్ సెల్వంను దుష్టశక్తి అని విజయశాంతి అభివర్ణించింది. అన్నాడీఎంకే పాలనకు గండి కొట్టడానికి ఓపీఎస్ వర్గం ప్రయత్నిస్తున్నదని ఆరోపించింది. 122 మంది ఎమ్మెల్యేలను రక్షించుకోవడానికి శశికళ చేస్తున్న ప్రయత్నాలను సమర్థించింది. చిన్నమ సీఎం కావడమే తన ఏకైక లక్ష్యమని పేర్కొన్నది.

విజయశాంతి ఏమైనా పొలిటికల్ లెజెండా

విజయశాంతి ఏమైనా పొలిటికల్ లెజెండా

విజయశాంతి చేసిన వ్యాఖ్యలపై తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జేమ్స్ వసంతన్ భగ్గుమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రెచ్చగొట్టేలా మాట్లాడటం తగదని వార్నింగ్ ఇచ్చారు. ‘విజయశాంతి ఏమైనా పొలిటికల్ లెజెండ్ అనుకొంటున్నారా? విజయశాంతికి ఏమైనా అభిప్రాయాలుంటే ఆమె రాష్ట్రంలో చెప్పుకోమను. ఇది సినిమా కాదు. తమిళ ప్రజల భవిష్యత్తు' అని ఆయన తీవ్రంగా స్పందించారు.

English summary
Kollywood music director James Vasanthan warned actor, politician Vijayashanthi, He said, "Does Vijayashanthi think she is a big political legend? Keep your views within your State, for this is not a movie but the lives of Tamil people".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu