»   » మ్యాస్ట్రో ఇళయరాజాకు స్వల్ప అస్వస్థత

మ్యాస్ట్రో ఇళయరాజాకు స్వల్ప అస్వస్థత

Subscribe to Filmibeat Telugu

చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వల్ప స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే తమిళనాడులోని చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఇళయరాజాకు చికిత్స చేసిన వైద్యులు, ఎలాంటి ప్రమాదం లేదని చెప్పినట్లు ఆయన సోదరుని కుమారుడు డైరెక్టర్ వెంకట్ ప్రభు తెలిపారు.

ప్రస్తుతం ఇళయరాజాను ఐసియూలో ఉంచి అత్యవసర చికిత్స చేస్తున్నట్లు వైద్యులు చెప్పారు. కుటుంబ సభ్యులు గానీ, అభిమానులు గానీ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు. కాగా ఇళయరాజా తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషలలో అనేక చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. మైత్రి, ఒగ్గరానే అనే కన్నడ చిత్రాలకు ఆయన తాజాగా సంగీతం అందిస్తున్నారు.

చెన్నైలో ఇటీవల జరిగిన ఓ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కొత్త దర్శకుల చిత్రాలకు సంగీతం అందించటం పట్ల తానెప్పుడూ వెనకాడలేదని, అయితే అలాంటి దర్శకుల చిత్రాలకు సంగీతం అందించవద్దంటూ పలువురు తన వద్ద ప్రస్తావించినట్లు ఆయన పేర్కొన్నారు.

తానెప్పుడూ డబ్బు కోసం మాత్రమే సంగీతం అందించలేదని, అలా డబ్బు కోసం తాను ఆశపడి ఉంటే స్వచ్ఛమైన సంగీతం తననుంచి ఎప్పుడో దూరమై ఉండేదని ఆయన అన్నారు.

English summary
Music maestro Ilayaraja suffered from a mild heart attack while working at his studio in Chennai on Monday morning.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu