Don't Miss!
- News
లీటర్ పెట్రోల్, డీజిల్‌పై హఠాత్తుగా రూ.35 పెంపు..!!
- Sports
Australia Open 2023 విజేతగా నోవాక్ జకోవిచ్.. నాదల్ రికార్డు సమం!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
‘సాహో’.. తెర వెనక షాకింగ్ పరిణామాలు, ఆ ముగ్గరూ ఔట్, ఏం జరుగుతోంది?
బాహుబలి స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'సాహో' షూటింగ్ దాదాపుగా పూర్తయింది. సినిమా రిలీజ్ డేట్ ఖరారు చేస్తూ ఇటీవల అఫీషియల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యూవి క్రియేషన్స్ వారు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ స్పై థ్రిల్లర్‌లో శ్రద్ధా కపూర్ హీరోయిన్.
అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో ప్రేక్షకులు షాకయ్యే న్యూస్ బయటకు వచ్చింది. ఈ చిత్రం నుంచి సంగీత త్రయం శంకర్-ఎస్సాన్-లాయ్ తప్పకున్నట్లు ప్రకటించారు. ఇటీవల రిలీజ్ డేట్ పోస్టర్ విడుదలైనప్పుడే అందులో వారి పేరు లేక పోవడంపై చాలా మందిలో అనుమానాలు కలిగాయి. ఇపుడు వారే ఈ విషయాన్ని ఖరారు చేస్తూ ట్వీట్ చేశారు.
|
మేము తప్పుకున్నాం
‘మా అభిమానులకు ఓ విషయం చెప్పాలనుకున్నాం. మేము ‘సాహో' ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాం. శంకర్-ఎస్సాన్-లాయ్ ఈ చిత్రానికి పని చేయడం లేదు. ప్రభాస్, సుజీత్, వంశీ, ప్రమోద్, శ్యామ్‌తో పాటు ఈ సినిమాకు గుడ్ లక్' అంటూ ట్వీట్ చేశారు.

కారణం ఏమిటి? తెర వెనక ఏం జరుగుతోంది
మరో మూడు నెలల్లో సినిమా విడుదల ఉండగా.... శంకర్-ఎస్సాన్-లాయ్ తప్పుకున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశం అయింది. వారు ఎందుకు తప్పకున్నామనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. తెర వెనక ఏం జరుగుతుందనే సందేహాలు అభిమానులను ఉక్కరి బిక్కిరి చేస్తున్నాయి.

సంగీతం అందించేది ఎవరు?
శంకర్-ఎస్సాన్-లాయ్ సినిమా నుంచి తప్పుకున్న నేపథ్యంలో ‘సాహో'కు ఎవరు మ్యూజిక్ అందిస్తున్నారనేది హాట్ టాపిక్ అయింది. దర్శక నిర్మాతలకు, సంగీత త్రయానికి చాలా రోజుల క్రితమే విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. అన్నింటికీ ప్రిపేర్ అయి ఉండటం వల్లే నిర్మాతలు ఇటీవల విడుదల చేసిన పోస్టర్లో వారి పేర్లను వేయలేదు. సీక్రెట్‌గా మరో దర్శకుడితో మ్యూజిక్ కంపోజ్ చేయిస్తున్నారట. త్వరలోనే అభిమాలను సర్‌ప్రైజ్ యూవి క్రియేషన్స్ సంస్థ నుంచి ఒకటన రానుంది.

సాహో
‘సాహో' చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ప్రభాస్, శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, వెన్నెల కిషోర్, ఎవలీన్ శర్మ, మురళీ శర్మ, ఆదిత్య శ్రీవాస్తవ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.