»   » శ్రీదేవి బయోపిక్ అంటూ వార్తలు: అందరి నోరు మూయించిన వర్మ

శ్రీదేవి బయోపిక్ అంటూ వార్తలు: అందరి నోరు మూయించిన వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sridevi Biopic : It's A Foolish Attempt

శ్రీదేవి అంత్యక్రియలు పూర్తయ్యాయో లేదో... బాలీవుడ్లో కొన్ని మీడియా సంస్థలు శ్రీదేవి విషయాన్ని సెన్సేషన్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ శ్రీదేవి బయోపిక్ తీయబోతున్నాడంటూ... కొన్ని ఇంగ్లిష్ వెబ్ సైట్లు తాజాగా ఊహాగానాలతో కూడిన కథనాలు ప్రచురించాయి. దీనిపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు.

శ్రీదేవి బయోపిక్ తీయడం లేదు

శ్రీదేవి బయోపిక్ తీయడం లేదు

తాను శ్రీదేవి బయోపిక్‌ తీయడం లేదని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు. శ్రీదేవి బయోపిక్‌ తీస్తున్నాన్నంటూ మీడియలో వస్తున్న కథనాలు అవాస్తవం.... అని వెల్లడించారు.

ఫూలిష్ అటెమ్ట్ అవుతుంది

ఫూలిష్ అటెమ్ట్ అవుతుంది

ఒక వేళ నేను శ్రీదేవి బయోపిక్ తీస్తే.... అది ఫూలిష్ అటెమ్ట్ అవుతుంది. ఇలాంటి అవివేకమైన పని తాను చేయబోను అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

 ఫూలిష్ ఎందుకు అవుతుందంటే...

ఫూలిష్ ఎందుకు అవుతుందంటే...

శ్రీదేవి మీద బయోపిక్ తీయడం ఫూలిష్ అటెమ్ట్ ఎందుకు అవుతుందో కూడా వర్మ వెల్లడించారు. శ్రీదేవిలా ఆ పాత్రను పోషించగల, అందుకు సూటయ్యే నటి ఈ ప్రపంచంలో ఎవరూ లేరని, అందుకే తాను శ్రీదేవి బయోపిక్ తీయబోనని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.

అందరి నోరూ మూయించిన వర్మ

అందరి నోరూ మూయించిన వర్మ

శ్రీదేవి బయోపిక్ మీద వస్తున్న వార్తలను ఆదిలోనే ఖండించడం ద్వారా.... ఈ అంశంపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న మీడియా సంస్థల నోరు మూయించారు వర్మ.

English summary
"Sections of media reporting I am making a biopic on Sridevi is untrue ..I believe it's foolish to attempt also because there cannot be any actress who's remotely worthy enough to play her" RGV tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu