»   » అల్లు అర్జున్ ని కేరళ జనం ఎందుకు అంతలా ఇష్టపడుతున్నారో నాకైతే తెలియదు

అల్లు అర్జున్ ని కేరళ జనం ఎందుకు అంతలా ఇష్టపడుతున్నారో నాకైతే తెలియదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కేరళ జనం ఎందుకు నా బ్రదర్ ని అంతలా ఇష్టపడుతున్నారో తెలియదు. వాళ్లు చాలా ప్రేమను కురిపిస్తున్నారు. నేను కూడా మెల్లిగా మళయాళి కల్చర్, సినిమాలతో ప్రేమలో పడుతున్నాను. ఇప్పటికి నేను పదిసార్లకు పైగా కేరళ వెళ్లాను. నాకు అది కొత్త ప్లేస్ లా అనిపించదు. నేను ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాని వేరే మార్కెట్ కోసం చేస్తున్న సినిమాగా భావించటం లేదు. వేరే భాష వారిని అలరించటం అంటే...అది మన నటనకు ఓ సర్టిఫికేట్ లాంటిది అన్నారు అల్లు శిరీష్.

స్లైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి మల్లూవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడా క్రేజ్ ను దక్కించుకోబోతున్నాడు.. అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్. ఇటీవలే శ్రీరస్తు శుభమస్తు వంటి బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ చిత్రంతో మంచి ఊపు మీదున్న శిరీష్ మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టబోతున్నాడు.

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి స్క్రీన్ చేసుకోబోతున్నాడు అల్లు శిరీష్. అది కూడా ఓ యూనివర్శల్ సబ్జెక్ట్ ద్వారా.. ఓ మంచి పాత్రతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉందని శిరీష్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. మోహన్ లాల్ హీరోగా 1971 బియాండ్ బోర్డర్స్ అనే చిత్రం రూపొందిస్తున్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

గుర్తు పడుతున్నారు

గుర్తు పడుతున్నారు

నేను కేరళలలో ఎక్కడికి వెళ్లినా ..అక్కడ జనం ఇమ్మీడియట్ గా అల్లు అర్జున్ బ్రదర్ అని గుర్తు పడుతున్నారు. అది అక్కడ నేను ఎంతలా పనిచేయాలి అనేదానికి ఇచ్చిన హింట్ గా భావిస్తున్నా. తను అక్కడ తను టాలెంట్ ని, నటనా కౌశలాన్ని చూపించాల్సిన అవసరం ఉందని గమనించినట్లు అల్లు శిరీష్ చెప్తున్నారు.

కొడుకులిద్దరికి కేరళ దేవుడు

కొడుకులిద్దరికి కేరళ దేవుడు

అంతేకాదు మా అమ్మగారు అయ్యప్ప స్వామికి భక్తురాలు. ఆవిడ తిరపతి వెళ్లటం కన్నా ఎక్కువ సార్లు శబరిమలై వెళ్లారు. నేను ఈ సినిమా సైన్ చేయగానే ..నా కొడుకులిద్దరికి కేరళ దేవుడు ఆశీస్సులు లభించాయని సంతోషపడ్డారు అని అల్లు శిరీష్ చెప్పుకొచ్చారు.

కొత్తగా అనిపించలేదు

కొత్తగా అనిపించలేదు

మా యూనిట్ అంతా చాలా స్నేహంగా ఉంటోంది. అక్కడ వాళ్లంతా నా సోదరుడు అల్లు అర్జున్ సినిమాలు చూసినవారే. వాళ్లు వాటి గురించే మాట్లాడుతూంటారు. కాబట్టి నాకు కొత్తగా అనిపించలేదు. నేను కొద్దిగా మళయాళం ఫాలో అవ్వగలను. నాకు టీమ్ ...తమిళం, హిందీ, మళయాళం లో సీన్స్ ని వివరించి చెప్తూంటుంది. నేను చాలా ఫాస్ట్ గా ఉంటానని ఇక్కడ టీమ్ ...నన్ను ఎప్రిషియేట్ చేస్తోంది.

కమాండర్ గా ..

కమాండర్ గా ..

మోహన్ లాల్ తో కలిసి నటించే అవకాశం తొలి సినిమాకే రావడం అదృష్టంగా భావిస్తున్నా. మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టేందుకు ఇదే సరైన సబ్జెక్ట్ అని భావిస్తున్నాను. 1971 బియాండ్ బోర్డర్స్ పేరుతో రూపొందించబోయే ఈ చిత్రంలో ట్యాంక్ కమాండర్ గా ఫుల్ లెంగ్త్ సపోర్టింగ్ రోల్ ప్లే చేస్తున్నాను. ఈ చిత్ర కథ పాకిస్తాన్ కు వ్యతిరేకంగా రూపొందించట్లేదు. హ్యూమన్ డ్రామా, ఎమోషన్స్ తో కూడిన చిత్రమిది. ప్రతీ భారతీయుడు గర్వపడే రీతిలో ఉండే ఈ చిత్రాన్ని కోరుకుంటాడని ఆశిస్తున్నాను.

English summary
"I don't know why people from Kerala like my brother so much. They have been showing so much love, that I started falling in love with Malayali culture and films"... Said Allu Sirish.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu