»   » మహేష్ బాబు కూతురును విష్ చేయండి (ఫోటోలు)

మహేష్ బాబు కూతురును విష్ చేయండి (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు ముద్దుల కూతురు సితార రేపటితో సంవత్సరం వయసు పూర్తి చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు తన సోషల్ నెట్కర్లో సితార ఫోటోలను పోస్టు చేయడంతో పాటు తనను విష్ చేయండి అంటూ మెసేజ్ చేసాడు. ప్రస్తుతం మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి యూరఫ్‌లో ఉన్నారు.

అక్కడే సితార తొలి పుట్టన రోజు వేడుక నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మరి మీరు కూడా చిన్నారి సితారకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపండి మరి. సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న '1'(నేనొక్కడినే) చిత్రం షూటింగ్ ప్రస్తుతం యూరఫ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే.

మహేష్ బాబు-నమ్రతా శిరోద్కర్ దంపతులకు జులై 20, 2012న సితార జన్మించింది. సితారను తమ ఇంటి మహాలక్ష్మిగా భావిస్తున్నారు మహేష్ కుటుంబ సభ్యులు. సితార తాజా ఫోటోలు, మహేష్ బాబు సినిమా వివరాలు స్లైడ్ షోలో...

మహేష్ బాబు ఫ్యామిలీ ఫోటో...

మహేష్ బాబు ఫ్యామిలీ ఫోటో...

మహేష్ బాబు తన భార్య నమ్రత శిరోద్కర్, కుమారుడు గౌతం, కూతురు సితారలతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన దృశ్యం. రేపు సితార పుట్టినరోజును పురస్కరించుకుని మహేష్ బాబు స్వయంగా తన సోషల్ నెట్కర్కింగ్ సైట్లో ఈ ఫోటోలను పోస్టు చేయడం గమనార్హం.

మహేష్ బాబుతో ఆటలాడుతున్న సితార

మహేష్ బాబుతో ఆటలాడుతున్న సితార

తండ్రి మహేష్ బాబుతో సితార ఆటలాడుతున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. మహేష్ బాబు ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. సితారకు నా ముక్కంటే ఎంతో ఇష్టం అంటూ మహేష్ బాబు సరదా వ్యాఖ్యలు చేసారు. రేపు యూనిట్ సభ్యుల ఆధ్వర్యంలోనే ఇక్కడ సితార పుట్టినరోజు వేడుకలు జరుగనున్నట్లు తెలుస్తోంది.

వెండి తెర ఎంట్రీ ఇవ్వబోతున్న గౌతం..

వెండి తెర ఎంట్రీ ఇవ్వబోతున్న గౌతం..

మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘1'(నేనొక్కడినే) చిత్రం ద్వారా మహేష్ వారసుడు గౌతం కృష్ణ బాలనటుడుగా వెండితెర తెరంగ్రేటం చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలోనే ఈ విషయాన్ని మహేష్ బాబు ఓ ప్రెస్ మీట్లో స్పష్టం చేసాడు. తాజాగా గౌతం కృష్ణ‌పై లండన్లో పలు సీన్లు చిత్రీకరిస్తున్నారు.

గౌతం పాతక్ర ఏమిటంటే....

గౌతం పాతక్ర ఏమిటంటే....

ఈ చిత్రంలో గౌతం కృష్ణ...సినిమాలో మహేష్ బాబు చిన్ననాటి పాత్రను పోషించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన సీన్లు ఆదివారం చిత్రీకరిచారు. మహేష్ బాబు తనయుడు తెరంగ్రేటం చేసే సినిమా కావడంతో ‘1' చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

మహేష్ బాబు నటవారసత్వం

మహేష్ బాబు నటవారసత్వం

సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వంగా మహేష్ బాబు చిన్న తనంలోనే బాల నటుడిగా వెండి తెర తెరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే. అదే బాటలో గౌతం మహేష్ బాబు నట వారసుడిగా వెండితెరంగ్రేటం చేయబోతుండటం గమనార్హం. మహేష్ బాబు తనయుడు గౌతం మహేష్ బాబు పోలికలతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు.

She loves my nose..:) my daughter turns 1 tomorrow . Wishing the love of our lives a very happy birthday:) pic.twitter.com/t56GCVkFuo
— Mahesh Babu (@urstrulyMahesh) July 19, 2013

Only blessings and wishes for our little princess:) pic.twitter.com/l2HYRQlvFp
— Mahesh Babu (@urstrulyMahesh) July 19, 2013

English summary
"She loves my nose..:) my daughter turns 1 tomorrow . Wishing the love of our lives a very happy birthday:), Only blessings and wishes for our little princess:)" Mahesh Babu tweeted.

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu