»   » ఎన్టీఆర్ ‘యుగానికి ఒక్కడు’ అంటున్న బాలకృ ష్ణ

ఎన్టీఆర్ ‘యుగానికి ఒక్కడు’ అంటున్న బాలకృ ష్ణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి తరాక రామారావు అరవయ్యేళ్ళ నటప్రస్తానం పై 'యుగానికి ఒక్కడు" అనే పుస్తకం వెలువడింది. ఈ పుస్తకాన్ని ఇటీవల ప్రముఖ నటులు కృష్ణం రాజు ఆవిష్కరించారు. తొలి ప్రతిని నందమూరి బాలకృష్ణ స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాన్నగారి జీవితం పై ఎన్నీ పుస్తకాలోచ్చాయి. అందులో ఒక అధ్యాయం లాంటింది 'యుగానికి ఒక్కడు". నాన్న గారికి భారత రత్న బిరుదు ఇవ్వాలనే డిమాండ్ చాల రోజులుగా ఉంది నా దృష్ణిలో ఆయనకు బిరుదులూ అలంకారం కాదు, బిరుదులకే ఆయన అలంకారం" అన్నారు.

మహానటుడు నందమూరి తారక రామారావు అందుకున్న తోలి పారితోషికం ఎంతో తెలుసా... అక్షరాలా 250 రూపాయలు. మనదేశం చిత్రంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ పాత్రకు గాను ఆయన తోలి పారితోషకాన్ని నిర్మాత కృష్ణవేణి చేతుల మీదుగా అందుకున్నారు. బుధవారం జరిగిన యుగానికి ఒక్కడు పుస్తకావిష్కరణలో పాల్గొన్న శ్రీమతి కృష్ణవేణి ఈ విషయాన్ని నెమరువేసుకున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu