»   » నచ్చిన డైలాగ్ అది, కానీ బూతు అని తెలియదు: రోజా

నచ్చిన డైలాగ్ అది, కానీ బూతు అని తెలియదు: రోజా

Posted By:
Subscribe to Filmibeat Telugu

"సీతారత్నం గారి అబ్బాయి సినిమాలో..ఇత్తడైపోద్ది డైలాగ్‌. అప్పుడు దానర్థం తెలియదు. తరువాత తెలిసింది బూతు అని" రోజా ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో చెప్పింది. తనను సినిమాల్లోకి, రాజకీయాల్లోకి తెచ్చింది ఎంపీ శివప్రసాదేనని ఆమె చెప్పింది.

"నేను ఆర్టిస్ట్‌గా ఉన్నపుడు చిరంజీవిగారి ఫ్యామిలీ ఫ్రెండ్‌ని. ముఠామేస్త్రి షూటింగ్‌ అప్పుడు శ్రీజ వాళ్లు చిన్న పిల్లలు. వాళ్లని ఎత్తుకున్నాను కూడా. పార్టీ పాలసీలను బట్టే మాట్లాడాలి తప్ప ఎవరిమీదా కోపం లేదు." అని రోజా తెలిపింది.

"సినిమాలు తీయాలన్న ఆలోచన నా భర్తది. కానీ అది ఏ ముహూర్తంలో మొదలుపెట్టామో గానీ కష్టాలు మొదలయ్యాయి. నాకు యాక్సిడెంట్లయ్యి వడ్డీలు పెరిగిపోయాయి. 'సమరం' సినిమాలో చాలా పోయింది. దాన్ని సెటిల్‌ చేయడానికి 2000 సంవత్సరం వరకు సినిమాల్లో నటించాను. ఈ స్ట్రగుల్‌ లో అవమానాలతో బాధపడ్డాను." అని రోజా ఆ టీవీ చానల్ కార్యక్రమంలో వెల్లడించింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu