»   » పెళ్లైన తొలి ఏడాది చాలా కఠినంగా సాగింది: రామ్ చరణ్ భార్య ఉపాసన

పెళ్లైన తొలి ఏడాది చాలా కఠినంగా సాగింది: రామ్ చరణ్ భార్య ఉపాసన

Posted By:
Subscribe to Filmibeat Telugu
Upasana Wished To Ramcharan In A Special Way

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన.... అపోలో వైస్ చైర్‍పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె అత్తింటివారి మెగా స్టార్ ఇమేజ్‌తో సంబంధం లేకుండా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

మీకు లభించిన అతిపెద్ద బ్లెస్సింగ్స్...

మీకు లభించిన అతిపెద్ద బ్లెస్సింగ్స్...

నాకు లభించిన అతిపెద్ద బ్లెస్సింగ్... మా గ్రాండ్ పేరెంట్స్. అటు అమ్మ వైపు, ఇటు నాన్న వైపు ఎంతో గొప్పవారైన గ్రాండ్ పేరెంట్స్ నాకు లభించారు అని ఉపాసన తెలిపారు.

మీ గురించి మీరు ఆలస్యంగా తెలుసుకున్న విషయం?

మీ గురించి మీరు ఆలస్యంగా తెలుసుకున్న విషయం?

నేను చాలా మందిని ప్రభావితం చేశాను, ఈ విషయం చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను అని.... ఉపాసన తెలిపారు.

మీ బిగ్గెస్ట్ ఇన్స్‌‌స్పిరేషన్ ఎవరు?

మీ బిగ్గెస్ట్ ఇన్స్‌‌స్పిరేషన్ ఎవరు?

ఆ విషయం ఆయా రంగాలపై ఆధారపడి ఉంటుంది... కానీ మా పిన్నమ్మలు, పెద్దమ్మలు, మా అమ్మ నాకు బిగ్గెస్ట్ ఇన్స్‌స్పిరేషన్ అని ఉపాసన తెలిపారు.

మీ జీవితంలో కఠిన సమయం

మీ జీవితంలో కఠిన సమయం

పెళ్లయిన తొలి సంవత్సరం చాలా కఠన సమయం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ప్రతి వధువు తన జీవితం ఒక అద్భుతమైన చిత్రంలా సాగుతుందని అనుకుంటుంది, కానీ కొన్ని సార్లు పెళ్లయిన తొలి సంవత్సరం కాస్త కఠినంగా ఉండొచ్చు... అని ఎఉపాసన తెలిపారు.

ఈ ప్రపంచంలో మీకు బాగా నచ్చినది

ఈ ప్రపంచంలో మీకు బాగా నచ్చినది

నాకు మనుషులంటే చాలా ఇష్టం... అందరినీ ఇష్టపడతాను అంటూ ఉపాసన తనదైన రీతిలో స్పందించారు.

ఈ ప్రపంచానికి మీ గురించి తెలియని విషయం?

ఈ ప్రపంచానికి మీ గురించి తెలియని విషయం?

చాలా మందికి తెలియని విషయం నేను చాలా భయస్తురాలి. నేను ఇంటర్వ్యూకు చాలా కష్టంమీద సిద్ధం అయ్యాను. నా గురించి ప్రజలు ఏమనుకుంటారో? అనే ఆలోచనలు నా మైండ్‌లో తిరుగుతూ ఉంటాయి. నా సమస్యల ప్రభావం ఇతరులపై పడనివ్వను. ఎందుకంటే అవి నా సమస్యలు. వాటిని డీల్ చేయడంలోనే నా బలం ఏమిటో తెలుస్తుంది అని ఉపాసన తెలిపారు.

సోషల్ మీడియా గురించి

సోషల్ మీడియా గురించి

ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి సోషల్ మీడియా ఒక మంచి టూల్. కొన్ని సార్లు దీని వల్ల మంచి జరుగొచ్చు, చెడు కూడా జరుగవచ్చు. కొన్ని సార్లు ఇది మీరు గ్రేట్‌గా ఫీలయ్యేలా చేస్తుంది, కొన్ని సార్లు బ్యాడ్‌గా ఫీలయ్యేలా చేస్తుంది. మీరు పాజిటివ్ థింక్స్ మీదనే దృష్టి కేంద్రీకరిస్తే మీ చుట్టూ ఉన్న ప్రపంచం పాజిటివ్‌గా కనిపిస్తుంది... అని ఉపాసన తెలిపారు.

English summary
"My first year of marriage is toughest time in my life. Everyone has it. Every bride thinks that life is going to be a fabulous movie but the first year of marriage can be sometimes pretty tough." Upasana said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X