For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫేక్ కాదు ...నిజమే అంటున్న అనుష్క

  By Srikanya
  |

  హైదరాబాద్ : ‘నేను లావుగా కనిపిస్తున్న లుక్ ఫేక్ కాదు. ఆ సినిమాకోసం నేను కార్బోహైడ్రేట్స్ తీసుకొని లావు అయ్యానని' అని అనుష్క తెలిపింది. 'సైజ్‌ జీరో' చిత్రంలో ఆమె లావుగా కనపడటం అబద్దమని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆమె టీవి 9 తో మాట్లాడుతూ ఇలా స్పందించింది. 17 కిలోలు ఆమె ఈ సినిమా కోసం పెరిగింది.

  ప్రకాష్ కోవెల మూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుష్కతో పాటు ఆర్య, సోనాల్ చౌహాన్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పివిపి బ్యానర్ పై ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించాడు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  MY LOOK IN SIZE ZERO ISN’T FAKE: ANUSHKA SHETTY

  ''నా దృష్టిలో ప్రతి విజయానికీ ఓ విలువ ఉంది. గెలుపే కాదు.... ఓటమీ విలువైనదే'' అంటోంది అనుష్క. ప్రస్తుతం ఆమె నటించిన 'సైజ్‌ జీరో', 'రుద్రమదేవి' చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండింటిలోనూ అనుష్కనే ప్రధాన పాత్రధారి. తన పదేళ్ల కెరీర్‌లో ఎన్నో విజయాలు అందుకొంది అనుష్క.

  వాటి గురించి మాట్లాడుతూ ''నా ప్రతి గెలుపూ నాకు మధురమే. ఏ సినిమాని ప్రత్యేకంగా చెప్పుకొన్నా మరో విజయాన్ని తక్కువ చేసినట్టే. గెలుపే కాదు.. నేను ఎదుర్కొన్న ఓటములు కూడా మర్చిపోలేను. ఓ గెలుపు జీవితంపై భరోసాని కలిగిస్తుంది. ఓటమి మాత్రం ఎన్నో పాఠాల్ని నేర్పుతుంది. నా దగ్గర ఓ లక్షణం ఉంది. ఓ తప్పు చేశానంటే.. జీవితాంతం దాన్ని గుర్తుపెట్టుకొంటా. మళ్లీ పునరావృతం చేసే అవకాశమే ఇవ్వను. పాత తప్పులు మళ్లీ చేయకపోవడం కంటే గొప్ప గెలుపు ఉండదేమో'' అని చెప్పుకొచ్చింది.

  కమల్ హాసన్ సూపర్ హిట్ చిత్రం క్షత్రియ పుత్రుడులోని సన్నజాజి పడక పాటను అనుష్క,ఆర్యలపై రీమిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం...ఈ పాట స్ఫూఫ్ మాత్రం కాదు..సినిమాలో ఓ సన్నివేశంలో ఆర్య,అనుష్క టీవిలో సన్నజాజి పడక సాంగ్ ని చూస్తూంటారు. తమని తాము ఆ పాటలో ఊహించుకుంటారు. సంప్రదాయ దుస్తుల్లో అప్పుడు వీరిద్దరూ ఉంటారు. ఇలా చేయటానికి ఇళయరాజా సైతం సమ్మతించినట్లు చెప్తున్నారు.

  MY LOOK IN SIZE ZERO ISN’T FAKE: ANUSHKA SHETTY

  చిత్రం విశేషాలకు వస్తే...

  ‘బాహుబలి' చిత్రంలో దేవసేన పాత్రలో అలరించిన హీరోయిన్ అనుష్క త్వరలోనే వైవిధ్యమైన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘సైజ్ జీరో'తో మన ముందుకు రానుంది. తెలుగు, తమిళంలో ద్వి భాషా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ మేరకు రోజుకో పోస్టర్ చొప్పున విడుదల చేసి క్రేజ్ క్రియేట్ చేస్తున్నారు.

  పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘సైజ్ జీరో'. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు . డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం వెయిట్ లాస్ కి సంబంధించిన కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం అనుష్క దాదాపు ఇరవై కేజీల బరువు పెరిగింది. అలాగే హీరో ఆర్య ఇచ్చిన టిప్స్ సహాయంతో మళ్లీ బరువు తగ్గి నార్మల్ అయింది.

  ఇక హీరో ఆర్య ఇటీవల స్వీడన్ మీదుగా కఠినతరమైన సైకిల్ రైడ్ ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. సైజ్ జీరో నిర్మాతలు ఈ చిత్రంలో అలాంటి కష్టతరమైన సైక్లింగ్ విన్యాసాలను ఇందులో చూపిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యయం.కీరవాణి ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

  అనుష్క, ఆర్య, భరత్, ఊర్వశి ప్రధాన తారాగణంగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిర్వాషా, ఆర్ట్: ఆనంద్ సాయి, కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి, దర్శకత్వం: ప్రకాష్ కోవెల మూడి.

  English summary
  Actress Anushka Shetty, in a recent interview, revealed that the makers of Size Zero hadn’t performed any gimmicks to make her look extremely fat in the film. Anushka also revealed that she hadn’t followed any special diet for the role. “I mostly binged on food replete with carbohydrates such as rice”, she told TV9.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X