Just In
- 10 min ago
నా ఈ మాటలు గుర్తు పెట్టుకోండి.. విజయ్ దేవరకొండ ఎమోషనల్
- 16 min ago
అల్లు అర్జున్ డ్యాన్స్ అంటే ఇష్టం అంటున్న బాలీవుడ్ కండల వీరుడు
- 24 min ago
సరికొత్త లుక్‌లో అక్కినేని హీరో: అఖిల్ కొత్త సినిమా మొదలయ్యేది అప్పుడే
- 30 min ago
Box office: 6వ రోజు అల్లుడు అదుర్స్ డౌన్.. రెడ్ సినిమాకు వచ్చింది ఎంతంటే?
Don't Miss!
- News
పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికి బిగుస్తున్న ఉచ్చు- ఇళ్లలో సీఐడీ సోదాలు- క్రైస్తవ గ్రామాల అన్వేషణ
- Lifestyle
బాదం చట్నీతో బోలెడన్నీ లాభాలు... దీన్ని ఈ సమయంలోనే ఎక్కువగా తినాలట...!
- Sports
'ఇండియన్స్‌ను తక్కువ అంచనా వేయం.. ఈ గెలుపు మమ్మల్ని చాలా రోజులు బాధిస్తుంది'
- Automobiles
2030 నాటికి భారత్‌లో రోడ్డు ప్రమాదాలు సున్నా చేయడానికి కేంద్రం ముందడుగు
- Finance
అమెరికా ప్యాకేజీ ఎఫెక్ట్, సెన్సెక్స్ భారీగా జంప్: రిలయన్స్, ఐటీ స్టాక్స్ అదుర్స్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డేటింగ్ నిజమే: అమ్మానాన్న విడిపోయాక ధైర్యంగా..
హైదరాబాద్: ప్రముఖ నటుడు కమల్ హాసన్, నటి సారిక ప్రేమ వివాహం చేసుకోవడం, వీరికి శృతి హాసన్, అక్షర హాసన్ జన్మించడం....తర్వాత 2002లో కమల్, సారిక విడిపోవడం తెలిసిందే. తల్లిదండ్రుల వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న శృతి హాసన్ చాలా కాలం క్రితమే తెరంగ్రేటం చేసి స్టార్ హీరోయిన్ కాగా, అక్షర హాసన్ ‘షబితాబ్' చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెరంగ్రేటం చేయబోతోంది.
ఇటీవల ఓ కార్యక్రమంలో తల్లిదండ్రులు విడిపోవడంపై 24 సంవత్సరాల అక్షర హాసన్ స్పందిస్తూ....అమ్మా నాన్నలు విడిపోయిపుడు చాలా బాధ పడ్డాను, కానీ ఆ పరిస్థితులు నన్ను మరింత స్ట్రాంగ్, ధైర్యంగా ముందుకు సాగేలా చేసాయి, సొంతగా ఎదగడం నేర్చుకున్నాను అని తెలిపారు. అమ్మా నాన్నలు ఇద్దరూ సినిమా రంగంలో స్థిర పడ్డవారే కావడం...వారి నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను అన్నారు. అయితే చిన్నతనం నుండి ఎక్కువగా అక్క వద్దే పెరిగాను. అక్క నాకు అన్ని విధాలుగా సపోర్టుగా ఉంటుంది. నాన్న చాలా సరదాగా ఉంటారు, కానీ అమ్మంటేనే నాకు చాలా ఇష్టం అన్నారు.
గతంతో తాను వివన్ షాతో డేటింగ్ చేసిన మాట నిజమే, కానీ ప్రస్తుతం ఫ్రెండ్స్ గా మాత్రమే ఉన్నాం. నటిగా మాత్రమే కాదు, భవిష్యత్తులో దర్శకత్వం చేసే ఆలోచన కూడా ఉంది. కథ కూడా సిద్దం చేసుకుంటున్నాను అన్నారు.

‘షబితాబ్' సినిమా విషయానికొస్తే ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ధనుష్, అక్షర హాసన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ధనుష్‌కు జోడీగా అక్షర హాసన్ నటించింది. ఇటీవలే ఈచిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది. టీజర్ చూసిన వారంతా ప్రసంశల్లో ముంచెత్తుతున్నారు. హిట్ గ్యారెంటీ అంటున్నారు. ఈ చిత్రం కోసం బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరోసారి తన గళాన్ని విప్పారు. ఓ గీతాన్ని ఆలపించారు. ఆర్. బాల్కీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇంతకుముందు అమితాబ్ నటించిన చీనీ కమ్, పా చిత్రాలకు కూడా బాల్కియే దర్శకుడు.
సినిమా విభిన్నంగా సాగుతుంది. తొలి చిత్రం ‘రంఝానా'తో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ధనుష్....రెండో చిత్రంతో హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈచిత్రం ఫిబ్రవరి 6న విడుదలకు సిద్ధమవుతోంది.